'రాష్ట్రంలో 5 కేంద్రాల ద్వారా సేవలు - పాస్​పోర్టు కావాలంటే అక్కడికి వెళితే చాలు' - Secunderabad RPO Snehaja

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 2:07 PM IST

thumbnail

Secunderabad RPO Snehaja Interview : పాస్‌ పోర్ట్​ల జారీలో దేశంలో ఐదో స్థానంలో ఉన్న సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌ పోర్ట్ కార్యాలయం, 2023లో 7.85 లక్షల మందికి పాస్‌ పోర్ట్​లను జారీ చేసింది. ఇలా ఏటా లక్షల మంది వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ డిమాండ్‌ను అక్రమార్జన కోసం వినియోగించుకుంటున్న కొందరు అక్రమార్కులు, దరఖాస్తుదారుల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే విద్యావంతులు సైతం అక్రమార్కులు, దళారులను ప్రోత్సహిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కాగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్ట్​ల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి చెబుతున్నారు. రాష్ట్రంలో 5 పాస్​పోర్ట్​ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొవిడ్​ తరువాత వీటి​ సేవలు మరింత పెరిగినట్లు చెబుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్‌పీవో స్నేహజ మాటల్లోనే విందాం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.