LIVE : సరూర్​నగర్​ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ - lok sabha elections 2024

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 4:30 PM IST

Updated : May 9, 2024, 7:23 PM IST

thumbnail

Rahul Gandhi Meeting Live : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్​,  సరూర్ నగర్​లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతరలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ, అదే ఊపును పార్లమెంట్ ఎన్నికలో కొనసాగించాలని చూస్తోంది. ఈసారి రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 14 స్థానాలు గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పక్కా వ్యూహాలతో ఎన్నికల సమరంలోకి దూకింది. ఇందులో భాగంగా పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో పర్యటిస్తూ సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని అంటున్నారు. అలాగే బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనల వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

Last Updated : May 9, 2024, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.