బీజేపీలో సీఎం రేవంత్​ చేరతారనే బీఆర్ఎస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : ప్రొఫెసర్ కోదండరాం - Prof Kodandaram Fires On BRS

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 4:45 PM IST

thumbnail
బీజేపీలో సీఎం రేవంత్​ చేరతారనే బీఆర్ఎస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : ప్రొఫెసర్ కోదండరాం (ETV BHARAT)

Prof. Kodandaram Fires On BRS : పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి చేరుతారని పదేపదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమని తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్​గా ప్రజలను ఆకట్టుకునేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జీవన్​రెడ్డికి మద్దతుగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే రెండు విధాలుగా లాభపడవచ్చని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటని, మాట్లాడేందుకు విషయాలు లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి పాటుపడుతుందని, ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.