దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది - తెలంగాణలోనూ వార్​ వన్​ సైడే : ధర్మపురి అర్వింద్ - Lok sabha Polls 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 10:52 PM IST

thumbnail

MP Dharmapuri Arvind On BJP Victory : దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, తెలంగాణలో కూడా లోక్​సభ ఎన్నికలు వన్ ​సైడ్​ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 370 పైచిలుకు సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో చాయ్​ పే చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానికులతో ముచ్చటించారు.  

MP Arvind Comments on Kavitha case : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకముందు గులాబీ పార్టీ, బీజేపీ దోస్తీ అని బద్నాం చేశారని, ప్రస్తుతం ఈడీ, సీబీఐ రెండూ ఆమెను అరెస్టు చేశాయన్నారు. అవినీతి అసమర్థ పాలనతోనే ఇప్పటి వరకు బోధన్​ చెరకు పరిశ్రమ తెరుచుకోవడం లేదన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకు జూలై 4న ముత్యంపేట బోధన్ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించి నడిపిస్తామని, చక్కరతో పాటు ఇంధనం, మొలాసిస్, బ్రౌన్ షుగర్​ను తయారు చేసి ఇక్కడి ప్రాంతాన్ని కళకళలాడేలా చేస్తామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తారా అని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.  

పసుపు బోర్డు ఏర్పాటుతో ఎగుమతులు పెరిగి, మంచి ధరలు పలుకుతూ రైతులకు దోహదపడుతున్నాయని, వచ్చే సంవత్సరం క్వింటాలుకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు ధర పలికినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే అనుమానాలు వద్దని, ఇందూరు గడ్డపై ఏర్పాటు చేస్తారని రైతులకు భరోసా కల్పించారు. తన సుదీర్ఘ ప్రస్తానంలో జీవన్​ రెడ్డి ఏ ఒక్క పని చేశారో చెప్పాలని అర్వింద్ సవాల్​ విసిరారు. అనంతరం సాయిరాం కాలనీలోని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.