పీఎఫ్‌ఐ, సిమీ లాంటి తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ కేంద్రంగా మారింది : ఎంపీ అర్వింద్​ - MP Arvind Allegation on Congress

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 4:45 PM IST

thumbnail
పీఎఫ్‌ఐ, సిమీ లాంటి తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ కేంద్రంగా మారింది : ఎంపీ అర్వింద్​ (ETV Bharat)

MP Arvind on Congress : తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్​కు సంబంధాలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిషేధిత సంస్థ సిమీ( స్టూడెంట్​ ఇస్లామిక్​ మూమెంట్​ ఆఫ్​ ఇండియా) ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ముస్లింలందరూ కాంగ్రెస్​కు సపోర్ట్​ చేయాలని ఆ సంస్థ చేసిన తీర్మానంలో పేర్కొందని తెలిపారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. 

నిషేధిత సంస్థ సిమీపై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని ఎంపీ అర్వింద్ వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమీ లాంటి సంస్థలు కాంగ్రెస్​కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని చెప్పారు. తీవ్రవాద సంస్థలకు హస్తం పార్టీ మాతృ సంస్థగా మారిందని మండిపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలు కంట్రోల్​ చేస్తాయని, అలా జరిగితే భారతదేశం అతి భయంకరంగా మారే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.