లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ పూర్తిగా ఉనికి కోల్పోతుంది : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 3:31 PM IST

thumbnail

MLC Jeevan Reddy Interesting comments on BRS : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ పూర్తిగా ఉనికి కోల్పోతుందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి(MLC Jeevan Reddy) ‌అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మిస్తే మూడేళ్లు కూడా నిలబడలేదని దుయ్యబట్టారు. టీఎస్​పీఎస్సీ సంస్థను బీఆర్ఎస్​ అమ్మకంలో పెట్టిందని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఒక్క రేషన్​ కార్డు కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చినప్పుడే కనుమరుగు అయిందని ఎద్దేవా చేశారు. లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​ పూర్తిగా ఉనికి కోల్పోతుందని జోస్యం చెప్పారు.

MLC Jeevan Reddy on Telangana Investments : దావోస్​లో జరిగిన అంతర్జాతీయ ప్రపంచ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని జీవన్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి బృందం ఒక్క పర్యటనతో రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై​ విశ్వాసంతో పలు దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.93 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.