LIVE : తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం - KTR Press Meet In Hyd Live

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 12:03 PM IST

Updated : May 25, 2024, 12:36 PM IST

thumbnail

KTR Press Meet In Telangana Bhavan Live : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ తరపున ఊరూరా నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. జూన్ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​లో ఘనంగా వేడుకలు జరుగాయని ఆయన తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పాలన సాక్షిగా 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరని పునాది బీఆర్ఎస్​ ప్రభుత్వం వేసిందని కేటీఆర్ తెలిపారు.ఆరున్నర దశాబ్దాల పోరాటం, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు, బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు, ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష, ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయిందని పేర్కొన్నారు.ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కృతమైందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ, మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనుంది. జూన్ రెండో తేదీతో రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తవుతుంది.

Last Updated : May 25, 2024, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.