త్వరలో అందుబాటులోకి మల్టీ లెవల్​ కార్​ పార్కింగ్​ కాంప్లెక్స్​ - విశేషాలు ఇవే! - Multi Level Car Parking Complex

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 7:50 PM IST

thumbnail

Hyderabad Metro MD Visit Multi Level Car Parking Complex : హైదరాబాద్​ వాహనదారులకు శుభవార్త. నాంపల్లిలో నిర్మిస్తున్న మల్టీ లెవల్​ కారు పార్కింగ్​ కాంప్లెక్స్​ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు హైదరాబాద్​ మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని గుర్తు చేశారు. కాంప్లెక్స్​ పనులను పరిశీలించిన ఆయన, దాని విశేషాలను తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేట్​ భాగస్వామ్యంతో సుమారు రూ.80 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

Multi Level Car Parking Complex at Nampally : దేశంలోనే ప్రప్రథమంగా జర్మన్​ పాలిస్​ పార్కింగ్​ విధానంలో తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ప్రాజెక్ట్​ను రూపొందిచామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ అన్నారు. అర్ధ ఎకరంలో 15 అంతస్తులు నిర్మాణం జరిగిందన్నారు. అందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్​, మిగిలిన 5 అంతస్తుల్లో వాణిజ్య దుకాణాలు, రెండు తెరలతో ఒక సినిమా థియోటర్ ఉన్నాయని వివరించారు. పార్కింగ్​ ప్రదేశాల్లో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్క్​ చేసే అవకాశం ఉందన్నారు. ఈ కాంప్లెక్స్​ను పీపీపీ విధానంలో మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ రూపొందించిందని వెల్లడించారు. కోవిడ్ తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.