ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ - బాలుడికి తీవ్ర గాయాలు - Cylinder Blast In Secunderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 4:06 PM IST

thumbnail

Cylinder Blast In Secunderabad : గ్యాస్ సిలిండర్ లీకై పేలుడు సంభవించడంతో ఓ బాలుడికి తీవ్రగాయాలైన ఘటన సికింద్రాబాద్​లోని జవహర్​నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయి పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో స్థానికులు ఒక్క సారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. 

బీజేఆర్ నగర్ జ్యోతిరావు పూలే కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకయ్యింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో ప్రమాదం సంభవించింది. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బాన్సీ అనే బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో బాలుడిని మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరగుకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.