సిరిసిల్లలో కేటీఆర్‌, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ - KTR conversation in Siricilla

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 3:18 PM IST

thumbnail
సిరిసిల్లలో కేటీఆర్‌, అవ్వ మధ్య ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్ (etv bharat)

KTR MP Election Camapaign 2024 :  వైద్య కళాశాల కోసం ఇచ్చిన తన రెండు ఎకరాల భూమి పోయిందని ఆ అవ్వ, కేటీఆర్‌కు చెబితే కలెక్టర్‌కు చెప్పి తగిన న్యాయం చేస్తానని చెప్పారు. అంతలోనే ఆ అవ్వ డబుల్‌ బెడ్‌రూం ఇంటి గురించి కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీనికి కేటీఆర్‌ ఇస్తానని అంటే ఎప్పుడు ఇస్తారు అంటూ ఠక్కున ఎంతో ఆప్యాయంగా అడిగింది. దీంతో అక్కడ ఉన్న కేటీఆర్‌తో సహా మిగిలిన వారంతా కొంతసేపు నవ్వుకున్నారు. అలాగే ఆ అవ్వ ఎక్కడా జంకకుండా మార్కెట్‌లో ఉన్న సమస్యల గురించి సవివరంగా భయం లేకుండా చెప్పింది. 

ఈ సంభాషణ అంతా రాజన్న సిరిసిల్లలో ఉదయపు నడకకు వెళ్లిన కేటీఆర్‌కు వైద్య కళాశాల భూ నిర్వాసితురాలు లక్ష్మీకి మధ్య జరిగింది. వీరి మధ్య సాగిన ఈ సంభాషణ ఎంతో ఆసక్తిని గొలిపింది. మాజీ మంత్రి కేటీఆర్‌తో లక్ష్మీ ఆప్యాయంగా మాట్లాడుతూనే సమస్యలు ప్రస్తావించిన తీరు, అంతే ఆప్యాయంగా కేటీఆర్‌ స్పందించిన విధానం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఉదయపు నడకకు వెళ్లిన కేటీఆర్ ఓట్లును అభ్యర్థించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.