వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడం సరికాదు: సీఎఫ్​డీ - CFD Demands Remove Volunteers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 11:51 AM IST

thumbnail

CFD Demands Remove Volunteers As YSRCP Adviser : మే నెలకు సంబంధించిన పింఛన్లు 1-2 తేదీల్లోపే ఇంటింటికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి చేసింది. పింఛన్ల విషయంలో ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాలను వక్రీకరించేలా కొందరు వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎఫ్​డీని దోషిగా చూపేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడం సరికాదని సీఎఫ్​డీ కన్వీనర్ లక్ష్మణ రెడ్డి అన్నారు​.  

'ఇప్పటి వరకూ ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లను రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడమూ సరికాదు. ఈ తరహా రాజకీయ లబ్ది పొందాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ప్రజాధనంతో వేతనాలు తీసుకుంటున్న 46 మంది సలహాదారులు రాజకీయాలు మాట్లాడటకూడదు. వీరిని రాజకీయాలు మాట్లాడకుండా నిలువరించాలి లేదా వారిని సలహాదారుల పదవి నుంచి తప్పించాలని సీఎఫ్​డీ తరపున డిమాండ్ చేస్తున్నాం.' -సీఎఫ్​డీ కన్వీనర్ లక్ష్మణ రెడ్డి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.