పొలంలో 13 అడుగుల భారీ కొండచిలువ- 7 గంటలు శ్రమించి పట్టుకున్న అధికారులు - 13 feet python in Karnataka

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 10:41 AM IST

thumbnail

13 feet python in Karnataka : 13 అడుగుల పొడవైన కొండ చిలువను 7 గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు అటవీ అధికారులు. ఈ ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో మార్చి 23న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.  

కడబా తాలుకాలోని కొడింబాళ గ్రామంలో మార్చి 23న ఓ రైతు తన పొలంలో రబ్బరు తీస్తుండగా పాము బుస కొడుతున్న శబ్దం వినిపించింది. వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పాము కోసం వెతుకుతుండగా ఓ చెట్టుపై భారీ కొండ చిలువ కనిపించింది. వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గోపాల్ అనే స్నేక్​ క్యాచర్ ఘటనా స్థలికి చేరుకుని గ్రామస్థుల సాయంతో కొండ చిలువను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టాడు. అలా సుమారు 7 గంటల పాటు తీవ్రంగా శ్రమించి కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం అటవీ అధికారులు సురక్షితంగా అడవిలో వదిలి పెట్టారు. అయితే పామును పట్టుకునే సమయంలో ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని గోపాల్ తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.