ETV Bharat / technology

సబ్​స్క్రిప్షన్ లేకున్నా ఎక్స్​లో ఆడియా, వీడియో కాల్స్​- ఈ సెట్టింగ్స్ మార్చుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 10:34 AM IST

X  Audio Video Calling Feature
X Audio Video Calling Feature

X Audio Video Calling Feature : ప్రముఖ సోషల్ మీడియా యాప్​ ఎక్స్​ తన యూజర్ల కోసం కాలింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొస్తోంది. సాధారణ యూజర్లు ఎక్స్​లో ఆడియో, వీడియో కాల్స్​ చేసుకునేందుకు కొత్త ఫీచర్​ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇంజినీర్ ఎన్రిక్ బర్రాగన్ తెలిపారు. ఇంతకీ ఎక్స్​ నుంచి ఆడియో, వీడియో కాల్స్​ ఎలా చేసుకోవాలంటే?

X Audio Video Calling Feature : ఎక్స్​ యూజర్లకు ఆడియో, వీడియో కాలింగ్​ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. సాధారణ వినియోగదారులకు క్రమంగా ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తామని ఎక్స్​ ఇంజినీర్ ఎన్రిక్ బర్రాగన్ తెలిపారు. ఈ ఫీచర్​ ద్వారా సబ్​స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు సైతం ఉచితంగా ఎక్స్​ యాప్​ నుంచి ఆడియో, వీడియో కాల్స్​ చేసుకొవచ్చని వెల్లడించారు.
ఈ ఫీచర్​ను గతేడాది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఐఓఎస్) ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్​ ప్రీమియం యూజర్లను ఈ ఫీచర్ వాడుకోవడానికి అనుమతిచ్చారు.

Elon Musk X New Calling Feature : 2022లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌, సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్విట్టర్​కు 'ఎక్స్​'గా నామకరణం చేశారు. ఎక్స్​ను సమగ్ర అప్లికేషన్​గా చేయాలన్న ఆలోచనతో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆడియా, వీడియో కాల్స్​ను సాధారణ యూజర్లు ఉపయోగించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎక్స్​ యూజర్లు సబ్​స్క్రిప్షన్​తో సంబంధం లేకుండా, యాప్​లోని ఏ యూజర్​ నుంచి అయినా కాల్స్​ రిసీవ్​ చేసుకోవచ్చని బర్రాగన్ తెలిపారు.

ఎక్స్​లో ఆడియా, వీడియో కాల్స్​ చేయడం ఎలా?

  • యూజర్లు డైరెక్ట్​​ మెసేజెస్ (DM) సెట్టింగ్‌లలో వారి ఆడియో/ వీడియో కాలింగ్ ప్రాధాన్యాలను మార్చుకోవచ్చు.
  • యూజర్లు ఫాలో అవుతున్న ఖాతాలు, వారి అడ్రస్​ బుక్​లో ఉన్న ఖాతాల నుంచి డిఫాల్ట్​గానే కాల్స్​ రిసీవ్ చేసుకోవచ్చు.
  • యూజర్లు కాల్​ ప్రారంభించాలనుకుంటే కాలర్​, రిసీవర్​ ఇంతకుముందే మెసేజ్​లతో సంభాషణ చేసి ఉండాలి.
  • యూజర్లు ఎలాంటి కాల్స్​ను స్వీకరించాలి అనే ఆఫ్షన్లు కూడా ఎంచుకోవచ్చు. కానీ కాల్స్​ స్వీకరించిన సమయంలో ఐపీ అడ్రస్​ను సురక్షితంగా ఉంచుకోవడానికి 'ఎన్​హాన్స్​డ్ కాల్​ ప్రైవసీ' (Enhanced Call Privacy) సెట్టింగ్​ను ఆన్​ చేసుకోవాలి.
  • ఈ కొత్త కాలింగ్​ ఫీచర్​లు క్రమంగా అందుబాటులోకి వస్తాయి. డిఫాల్ట్​గా ఆన్​లోనే ఉంటాయి. ఒకవేళ మీకు అవి వద్దనుకుంటే, సెట్టింగ్స్​లోకి వెళ్లి కాలింగ్ ఫీచర్ ఆఫ్​ చేసుకోవచ్చు.

ట్రూకాలర్ నయా కాల్ రికార్డింగ్​ ఫీచర్ - రియల్​ టైమ్​లో ట్రాన్స్​క్రిప్షన్, కాల్ సమ్మరీ

స్కాన్​ చేస్తే టెక్స్ట్​ కాపీ- గూగుల్​ కీబోర్డ్​లో సూపర్​ ఫీచర్​- క్షణాల్లో పనులు పూర్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.