ETV Bharat / technology

ఏఐ హ్యూమనాయిడ్ రోబోస్ వచ్చేస్తున్నాయ్​ - మానవాళికి పెనుముప్పు తప్పదా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 12:58 PM IST

Elon Musk Humanoid Robot Optimus video
Humanoid Robot Race

Humanoid Robot Race : ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోలను తయారుచేసే పనిలో ఉన్నాయి. ఎలాన్ మస్క్ ఇప్పటికే ఒక హ్యూమనాయిడ్​ రోబోను రూపొందించారు. అమెజాన్​, మైక్రోసాఫ్ట్ లాంటి పలు కంపెనీలు కూడా ఇదే తరహా ప్లాన్స్ చేస్తున్నాయి.

Humanoid Robot Race : ప్రస్తుత టెక్​ ప్రపంచంలో 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' (AI)​ హవా నడుస్తోంది. ప్రముఖ టెక్​ సంస్థలు అన్నీ తమదైన ఏఐ టూల్స్ నిర్మించుకునే పనిలో ఉన్నాయి. ఓపెన్​ ఏఐకు చెందిన 'చాట్​జీపీటీ', గూగుల్​కు చెందిన 'జెమినీ'లకు పోటీగా యాపిల్ కంపెనీ 'ఆస్క్​' అనే ఏఐ టూల్​ను అభివృద్ధి పరుస్తోంది. ఇక భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ ఫండింగ్ చేసి 'హనుమాన్' అనే ఏఐ టూల్​ను డెవలప్ చేయిస్తున్నారు. త్వరలోనే దీనిని లాంఛ్ కూడా చేయనున్నారు. ఇంకా ప్రచారంలోకి రాని పలు కంపెనీలు కూడా ఏఐ టూల్స్ రూపకల్పన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

హ్యూమనాయిడ్ రోబో రేస్​
ఒకవైపు ఏఐ టూల్స్ రూపకల్పనలో పోటీపడుతున్న టెక్ దిగ్గజాలు, మరోవైపు హ్యూమనాయిడ్ రోబోల తయారీపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అమెరికాకు చెందిన అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​ ఇప్పటికే 'ఆప్టిమస్'​ అనే హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎక్స్​ (ట్విట్టర్​)లో షేర్ చేశారు. దీనిని దాదాపు 66 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ఆస్టిమస్​ అనే రోబో ఎవరి సాయం లేకుండా, తనకు నచ్చినట్లుగా సొంతంగా నడుస్తోంది. అంటే తనకు తానే స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సొంతంగా ఆలోచిస్తోంది!
'ప్రస్తుతానికి ఈ రోబో పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేయడం లేదు. కానీ భవిష్యత్​లో ఇది స్వతంత్రంగా ఆలోచిస్తూ, తన పనులు తనే చేసుకోగలుగుతుంది' అని ఎలాన్ మస్క్​ ట్వీట్ చేయడం విశేషం.

అమెజాన్​ రోబో : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్​, టెక్నాలజీ కంపెనీ ఎన్​వీడియాతో కలిసి కృత్రిమ మేధ కలిగిన హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయించడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 'ఫిగర్​ ఏఐ' అనే టెక్​​ స్టార్టప్​కు నిధులు అందిస్తున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్​ బెర్గ్​ న్యూస్​ తెలిపింది.

'హ్యూమనాయిడ్ రోబో తయారీకి ఏకంగా 2 బిలియన్ డాలర్లు సమీకరించాలని ఫిగర్ ఏఐ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 675 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఈ ఫీగర్ ఏఐ టెక్​ స్టార్టప్​కు జెఫ్ బెజోస్ తన సంస్థ అయిన ఎక్స్​ప్లోర్ ఇన్వెస్ట్​మెంటస్​ ఎల్​ఎల్​సీ ద్వారా​ 100 మిలియన్ డాలర్లు; మైక్రోసాఫ్ట్​ సంస్థ 95 మిలియన్ డాలర్లు అందించడం జరిగింది. ఎన్​వీడియా, అమెజాన్ అఫిలియేటెడ్​ ఫండ్​లు కలిసి మరో 50 మిలియన్ డాలర్లు సమకూరుస్తున్నారు' అని బ్లూమ్​బర్గ్ నివేదిక పేర్కొంది.

నో కామెంట్స్
హ్యూమనాయిడ్ రోబోలు తయారు చేయడానికి పెట్టుబడులు పెడుతున్నట్లు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించడానికి అమెజాన్​, మైక్రోసాఫ్ట్​, ఎన్​వీడియా కంపెనీలు నిరాకరించాయి.

పెనుముప్పు తప్పందా?
చాలా మంది టెక్​ నిపుణులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో మానవాళికి పెనుముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కానీ టెక్​ కంపెనీలు ఏఐ టూల్స్ తయారు చేయడానికి పరస్పరం పోటీపడుతున్నాయి. వీటికి తోడు ఏఐతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోస్​ను కూడా తయారు చేస్తున్నాయి. ఒక వేళ రోబోలు స్వయంగా ఆలోచించడం మొదలైతే, అప్పుడు మనుషుల పరిస్థితి ఏమౌతుందో!

కంటెంట్ క్రియేటర్ల కోసం 7 బెస్ట్ ఏఐ టూల్స్ - ట్రై చేయండి!

చాట్​జీపీటీకి పోటీగా యాపిల్ 'Ask' ఏఐ టూల్ - లాంఛ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.