ETV Bharat / technology

కంటెంట్ క్రియేటర్ల కోసం 7 బెస్ట్ ఏఐ టూల్స్ - ట్రై చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 4:36 PM IST

Best AI Tools For Content Creators : మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? బెస్ట్ ఏఐ టూల్స్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో 7 బెస్ట్ ఏఐ టూల్స్​ గురించి తెలుసుకుందాం.

AI tools for content creators
Best AI Tools for Content Creators

Best AI Tools For Content Creators : కంటెంట్​ క్రియేటర్ల కోసం నేడు మార్కెట్లో చాలా ఏఐ టూల్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్లేహెచ్​టీ, హేజెన్​, గ్రావిటీ రైట్​, అడోబ్​ ఫైర్​ఫ్లై, విద్​ర్యాపిడ్​, గైడ్​, ఆటోడ్రా లాంటి సూపర్ ఏఐ టూల్స్ ఉన్నాయి. వీటితో మీరు సూపర్ కంటెంట్​ను చాలా సులువుగా క్రియేట్ చేయవచ్చు. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  1. PlayHT : ఈ ప్లేహెచ్​టీ ద్వారా మీ వాయిస్​ను క్లోనింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సొంత వాయిస్​తో 30 సెకెన్లకు తక్కువ కాకుండా ఒక ఆడియో ఫైల్​ను క్రియేట్ చేసి, దానిని అప్లోడ్ చేయాలి. దీనితో మీ క్లోనింగ్ వాయిస్ క్రియేట్ అవుతుంది. దీనిని ఉపయోగించి టెక్ట్స్​ను మీ వాయిస్​తో ఆడియో రూపంలోకి మార్చుకోవచ్చు.
  2. HeyGen Labs : ఈ హేజెన్​ ల్యాబ్స్​ ఏఐ టూల్ ఉపయోగించి మీ ఆడియో లాంగ్వేజ్​ను నచ్చిన భాషలోకి ట్రాన్స్​లేట్ చేసుకోవచ్చు. అది కూడా మీ సొంత వాయిస్​తో, పెర్ఫెక్ట్​ లిప్​ సింక్​తో ట్రాన్స్​లేట్​ చేసుకోవచ్చు.
  3. GravityWrite : ఈ గ్రావిటీరైట్​ ఏఐ టూల్ ఉపయోగించి అమేజింగ్ కంటెంట్​ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో కంటెంట్ రైటింగ్​, ఫిల్మ్ మేకింగ్​, ఎస్​ఈఓ, మ్యూజిక్, యూట్యూబ్ టూల్స్ ఉంటాయి. దీనిని ఉపయోగించి మంచి స్క్రిప్ట్​, టైటిల్​, థంబ్​నెయిల్స్​​ క్రియేట్ చేసుకోవచ్చు.
  4. Adobe Firefly : మంచి ఇమేజ్​లు క్రియేట్ చేయాలని అనుకునేవారికి అడోబ్​ ఫైర్​ఫ్లై మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఏఐ టూల్ ద్వారా మంచి ఫొటోలను క్రియేట్ చేయడమే కాదు. ఇప్పటికే రెడీగా ఉన్న ఫొటోలను కూడా అద్భుతంగా మార్చుకోవచ్చు.
  5. VidRapid : యూట్యూబ్​ వీడియోలోని కంటెంట్​ను చిన్నచిన్న టెక్ట్స్ బిట్స్​ లాగా మారుస్తుంది. దీనిని ఉపయోగించి యూట్యూబ్​ ట్రాన్స్​క్రిప్షన్​ను సులువుగా పొందవచ్చు. అలాగే సదరు వీడియోలోని టాపిక్​ను సమ్మరైజ్​ చేసి చేసి చూసుకోవచ్చు. అలాగే టైమ్​ కోడ్స్​ ద్వారా మీకు నచ్చిన పార్ట్​లోకి సింపుల్​గా జంప్ చేయవచ్చు.
  6. Guidde : స్క్రీన్ రికార్డింగ్​ చేయడానికి ఈ గైడ్ ఏఐ టూల్​ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వీడియోలోని కంటెంట్​ను హైలెట్ చేయవచ్చు. యారో మార్క్స్​ పెట్టుకోవచ్చు. దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదా ఏఐ ద్వారా టెక్ట్స్​ టూ వాయిస్​ చేయించుకోవచ్చు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయవచ్చు.
  7. AutoDraw : చేతితో గీసిన చిత్రాలను అద్భుతంగా తీర్చిదద్దడానికి ఈ ఆటోడ్రా ఏఐ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ టూల్​లో చేతితో గీసిన చిత్రాలను ప్రొఫెషనల్​గా మార్చుకోవచ్చు. రంగులు కూడా అద్దవచ్చు.

చూశారుగా, ఈ ఏఐ టూల్స్ ఉపయోగించి సూపర్ కంటెంట్ క్రియేట్ చేసి మీ ఫాలోవర్స్​ను ఆశ్చర్యపరచండి. ఆల్​ ది బెస్ట్!

మీ యూట్యూబ్​ ఛానల్​ సక్సెస్​ కావాలా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే!

చాట్​జీపీటీకి పోటీగా యాపిల్ 'Ask' ఏఐ టూల్ - లాంఛ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.