ETV Bharat / technology

రూ.20వేల బడ్జెట్లో మంచి ట్యాబ్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 2:15 PM IST

Best Tabs Under 20000
Best Tablets Under 20000

Best Tablets Under 20000 : మీరు మంచి ట్యాబ్లెట్​ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.20,000 మాత్రమేనా? అయితే ప్రస్తుతం మీ బడ్జెట్​లో అందుబాటులో ఉన్న టాప్​-2 ట్యాబ్లెట్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Tablets Under 20000 : ప్రస్తుత స్మార్ట్​యుగంలో చాలా మంది ట్యాబ్లెట్స్​ వాడేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా మంచి ట్యాబ్​ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ కేవలం రూ.20 వేలు మాత్రమేనా? అయితే ఈ ఆర్టికల్​లో మీ బడ్జెట్​లో వచ్చే బెస్ట్​ ట్యాబ్లెట్​ల గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ట్యాబ్లెట్​ కొనుగోలు చేయడానికి ముందు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి అనే విషయాలను చూద్దాం.

మీరు ఎంత బడ్జెట్​లో ట్యాబ్లెట్​ కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ డిస్​ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, యూజర్ ఎక్స్​పీరియన్స్, స్టోరేజ్​, ఆపరేటింగ్ సిస్టమ్​, ప్రాసెసర్​, తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.​20 వేల బడ్జెట్లో మంచి ఫీచర్స్​, స్పెక్స్​ ఉన్న టాప్​-5 ట్యాబ్స్ గురించి తెలుసుకుందాం.

1. Samsung Galaxy Tab A8 Specifications

  • బ్రాండ్ : శాంసంగ్
  • మోడల్ : SM-X205NZAAINU
  • మెమొరీ స్టోరేజ్​ : 32 జీబీ
  • స్క్రీన్​ సైజ్​ : 26.69 సెం.మీ
  • డిస్​ప్లే రిజల్యూషన్ : 1920 1200

Pros

  • ఇంటర్నల్ మెమొరీని 1 టిబీ వరకు పెంచుకునే సౌలభ్యం ఉంది.
  • ఈ ట్యాబ్​లో మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ట్యాబ్​లో క్వాడ్ స్పీకర్లు ఉంటాయి.
  • 15W ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం ఉంది.
  • ఈ Samsung Galaxy Tabలో ఆండ్రాయిడ్ 11.0 వెర్షన్​ ఉంటుంది.
  • ఈ ట్యాబ్​లో UniSOC T618 octa-core ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy Tab A8 price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ట్యాబ్​ ధర రూ.16,000గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2.realme Pad Mini WiFi+4G Tablet Specifications

  • డిస్​ప్లే : 22.1 సెం.మీ HD డిస్​ప్లే
  • ప్రైమరీ కెమెరా : 8MP
  • ఫ్రంట్ కెమెరా : 5 MP
  • ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 11
  • బ్యాటరీ : 6400 MAh లిథియం-అయాన్
  • ప్రాసెసర్ : UNISOC T616 Octa-Core
  • నెట్​వర్క్ : వాయిస్ కాల్ ( డ్యూయల్ సిమ్, జీఎస్​ఎమ్​, WCDMA, LTE FDD, TD-LTE)

Pros

  • ఈ ట్యాబ్​లో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. కనుక ఇది మల్టీటాస్క్ంగ్​కు అనుకూలంగా ఉంటుంది.
  • ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​​ ఉంది.
  • 6400mAh సామర్ధ్యం గల బ్యాటరీ ఉంది.
  • శక్తిమంతమైన ప్రాసెసర్​ ఈ ట్యాబ్​లో ఉంది.
  • వివిధ నెట్​వర్క్​ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.

Realme Pad Mini Tablet price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ట్యాబ్ ధర రూ.14,999గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3. OnePlus Pad Go Tablet Specifications

  • బ్రాండ్ : వన్​ప్లస్​
  • మోడల్ : OnePlus Pad Go
  • మెమొరీ స్టోరేజ్ కెపాసిటీ : 128 జీబీ
  • స్క్రీన్ సైజ్ : 28.85 సె.మీ
  • డిస్​ప్లే రిజల్యూషన్ : 2408 x 1720 Pixels
  • ఐకేర్ ఫీచర్లు : లో బ్లూ లైట్

Pros:

  • ఈ ట్యాబ్​లో ఐకేర్ ఫీచర్లు ఉన్నాయి.
  • ఈ ట్యాబ్​ స్క్రీన్ సైజ్ 28.85 సెం.మీగా ఉంటుంది.
  • డిస్​ప్లే రిజల్యూషన్​ 2408X1720 పిక్సెల్స్ ఉంటుంది.
  • 33W SUPERVOOC టెక్నాలజీ ఫాస్ట్​ ఛార్జింగ్ సౌకర్యం ఉంది.
  • ఈ ట్యాబ్​ Android Oxygen OS 13.2 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.

OnePlus Pad Go Tablet Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ట్యాబ్ ధర రూ.19,999గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. HONOR Pad X8 Specifications

  • బ్రాండ్ : హానర్​
  • మోడల్ : AGM3-W09HN
  • మెమరీ : 64 జీబీ
  • స్క్రీన్ సైజ్ : 10.1 అంగుళాలు
  • డిస్​ప్లే రిజల్యూషన్ : 1920x1200 పిక్సెల్​లు

Pros

  • ట్యాబ్​ కేవలం 460 గ్రాముల బరువు ఉంటుంది. దీనివల్ల సులభంగా ఎక్కడైనా తీసుకువెళ్లవచ్చు.
  • The Split-Screen ఫీచర్​తో అనేక యాప్​లను ఒకే సమయంలో ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది.
  • ఈ ట్యాబ్​ న్యూ మ్యాజిక్ ఆండ్రాయిడ్ 12 వెర్షన్​తో యూఐ 6.1 ఆధారంగా పనిచేస్తుంది.
  • ఈ ట్యాబ్​లో మీడియా టెక్​ MT8786 8-core ప్రాసెసర్ ఉంటుంది.
  • ఆన్​లైన్ క్లాస్​లు, ఎంటర్​టైన్​మెంట్, ఆన్​లైన్ మీటింగ్​లు, గేమింగ్​లకు ఇది చాలా బాగుంటుంది.

HONOR Pad X8 Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ట్యాబ్ ధర రూ.9,999ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5. Lenovo Tab M10 Specifications

  • స్క్రీన్ సైజు : 10.61 అంగుళాలు
  • డిస్​ప్లే రిజల్యూషన్ : 2000 x 1200
  • సౌండ్ సిస్టమ్ : 4 స్పీకర్లు, 1WX4 డాల్బీ ఆటమ్స్
  • స్టోరేజ్, బ్యాటరీ : 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • బ్యాటరీ : 7700 mAh

Pros:

  • డాల్బీ ఆటమ్స్​ ఆప్టిమైజ్డ్​ 4 స్పీకర్​ సిస్టమ్​
  • ఈ ట్యాబ్​లో స్నాప్​డ్రాగన్ ఎస్​డీఎమ్ 680 ప్రాసెసర్ ఉంటుంది.
  • దీనిలో 7700 mAh బ్యాటరీ ఈ ట్యాబ్​లో ఉంటుంది.
  • దీనిలో 8 ఎంపీ హై క్వాలిటీ కెమెరా​, 8 ఎంపీ రియర్​ కెమెరా ఉన్నాయి.
  • గూగుల్ కిడ్స్​ ఆప్షన్ ఉంది. దీనితో పిల్లలకు చూడకూడని వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు.

Lenovo Tab M10 Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ ట్యాబ్ ధర రూ.15,998గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ స్మార్ట్​ఫోన్​​ డ్యామేజ్ కాకుండా క్లీన్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్​ మీ కోసమే!

'మనిషి మెదడులో చిప్ అమర్చాం- ఫలితాలు సూపర్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.