ETV Bharat / technology

మీ స్మార్ట్​ఫోన్​​ డ్యామేజ్ కాకుండా క్లీన్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్​ మీ కోసమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 1:39 PM IST

How To Clean Phone In Telugu : మ‌న ఫోన్ చూడటానికి బాగానే ఉన్నా దాని మీద కొన్ని వేల సూక్ష్మ జీవులు ఉంటాయి. అందులో మ‌న‌కు అనారోగ్యాలను క‌లిగించేవి చాలా ఉంటాయి. అందుకే మొబైల్స్​ను శుభ్రపరిచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని రోజులకోసారి మొబైల్స్ శుభ్రం చేసుకోవాలి? ఎలాంటి స్ప్రే వాడాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

How To Clean mobile In Telugu
How To Clean Phone In Telugu

How To Clean Phone In Telugu : ఈ కాలంలో ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రా స్మార్ట్​ఫోన్ ఉంటోంది. వాటి వినియోగం కూడా బాగానే పెరిగింది. మొబైల్స్​ను ఎక్కువగా వాడతారు కానీ దానిని శుభ్రం చేసుకోరు. దీని వల్ల ఫోన్ మీద బ్యాక్టీరియాలు పేరుకుపోతాయి. అందులో మ‌న‌కు అనారోగ్యం క‌లిగించేవి కూడా చాలానే ఉంటాయి. అనారోగ్యాన్ని కలిగించే ఈ-కోలై, స్ట్రెప్​ లాంటి హనికరమైన బ్యాక్టీరియాలు దాదాపు 92 శాతం మొబైల్స్​లో ఉంటున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే ఎప్ప‌టిప్పుడు ఫోన్స్ శుభ్రం చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

రోజూకు ఒకసారి తప్పసరి
ఫోన్స్ మీద ఉండే బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు మన కంటికి కనపించవు. అందువల్ల రోజూ వాటిని శుభ్రం చేసుకుంటే మంచిది అని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొంద‌రైతే మ‌నం బ‌య‌టి నుంచి ఇంటికెళ్లిన ప్ర‌తిసారీ శుభ్రం చేయాల‌ని చెబుతున్నారు. ఇలా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. సుల‌భంగానే ఈ ప్ర‌క్రియను పూర్తి చేసుకోవ‌చ్చు. దీనికోసం కావాల్సిన వ‌స్తువులు మ‌న ఇంట్లోనే ఉంటాయి.

ఇంట్లోనే ఫోన్స్ స్క్రీన్​ శుభ్రం చేయండిలా!
ఫోన్స్​ని శుభ్రం చేయటం కోసం ఒక మైక్రోఫైబర్ క్లాత్ కావాలి. ముందుగా మీ ఫోన్ స్వీచ్​ఆఫ్​ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్​ కేస్​ తీసేయాలి. ఎందుకుంటే మూల‌ల్లో కూడా సూక్ష్మజీవులు, క్రిములు ఉండే అవ‌కాశ‌ముంది. అందువల్ల ఫోన్ శుభ్రపరిచేటప్పుడు ఫోన్​ కేస్​ కూడా తీసేయ‌డం చాలా ముఖ్యం. స్క్రీన్​పై వేసిన గ్లాస్ పాడైపోయినా లేదా కొంచెం పగిలి ఉన్నా దాన్ని తొల‌గించాలి. లేకుంటే ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశముంది. అందుకే ఫోన్ మొత్తాన్ని మైక్రోఫైబర్ క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. కెమెరా లెన్స్‌లు, వాటి అంచుల్ని కూడా శుభ్రం చేయాలి.

సగటు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్​లో 10,000 కంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని అధ్యయనాల్లో తేలింది. అందుకే రోజూ దానిని శుభ్రం చేసుకోవాలి. క్లీనింగ్ కోసం ర‌సాయ‌నాల‌ను వాడితే ఫోన్​ డ్యామేజ్ అయ్యే అవ‌కాశ‌ముంటుంది. ఎందుకంటే వాటిల్లో కఠినమైన రసాయనాలు ఉంటాయి. అవి మీ ఫోన్ స్క్రీన్​ను, కెమెరాలను పాడుచేస్తాయని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. శానిటైజ‌ర్ ద్వారానే క్లీన్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.

దీని కోసం మీకు ఒక మైక్రో ఫైబ‌ర్ క్లాత్, 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ద్రావ‌ణం కావాలి. ఈ 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్​తో సమానంగా నీటిని కలపాలి. త‌ర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ద్రావణంలో క్లాత్ ముంచి ఫోన్​ని సున్నితంగా తుడ‌వాలి. ప్యూర్ అండ్​ క్లీన్ సర్ఫేస్ క్లీనర్స్​తోనూ ఫోన్స్ శుభ్రం చేసుకోవచ్చు.

మీ స్మార్ట్​ఫోన్ హ్యాంగ్ అవుతోందా?- ఈ టిప్స్​తో మీ మొబైల్​ మరింత ఫాస్ట్​!

మీ పాత ఫోన్​, ల్యాప్​టాప్​ అమ్మేస్తున్నారా? ముందుగా ఈ 10 పనులు చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.