ETV Bharat / state

నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా - ప్రేయసితో ఫోన్ మాట్లాడుతూ ప్రియుడి ఆత్మహత్య - YOUNG MAN SUICIDE FOR LOVE IN HYD

author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 10:18 AM IST

Young Man Committed Suicide For Love in Hyderabad: ప్రేమించిన యువతితో ఓ యువకుడు గొడవ పడ్డాడు. ఆమెతో ఫోన్​లో మాట్లాడుతూ నేను చనిపోతున్నా అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పరమారెడ్డి హిల్స్​లో జరిగింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Committed Suicide
Young Man Committed Suicide (ETV Bharat)

Young Man Committed Suicide in Hyderabad : వారిద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలు వేసుకుని కలిసి తిరిగారు. నువ్వులేక నేను లేనంటూ ఇద్దరూ క్షణం విడిచిపెట్టి ఉండేవారు కాదు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు. కొన్ని రోజులుగా ఆ ప్రేమికులు ఇద్దరూ గొడవపడ్డారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సహజం కానీ సడెన్​గా ప్రేమికురాలితో గొడవ పడిన ప్రేమికుడు ఫోన్​లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. ఆ అమ్మాయి వెంటనే స్పందించి అతడి ఇండి సమీపంలో ఉన్న స్నేహితుడిని పంపింది. కానీ అప్పటికే అతడజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పరమారెడ్డిహిల్స్​లో జరిగింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young Man Committed Suicide
మృతుడు ఇమ్రోజ్​పటేల్​ (ETV Bharat)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : వికారాబాద్​ జిల్లా తాండూర్​కు చెందిన ఇమ్రోజ్​ పటేల్​ కొన్నేళ్లుగా రాజేంద్రనగర్​లోని పరమా రెడ్డి హిల్స్​లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలో సాప్ట్​వేర్​ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఓ యువతిని ప్రేమించాడు. అప్పటివరకు బాగానే వారిద్దరు గడిపారు. ఇంతలో ఏం అయిందో తెలియదు కానీ కొన్ని రోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి మాట్లాడుకోవడం మానేశారు. ఈ క్రమంలో ఆ యువతి ఇమ్రోజ్​ను దూరం పెట్టింది. ఈ విషయంపై ఇమ్రోజ్​ పటేల్​ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన ప్రేమికుడు : ఆమెతో మాట్లాడకుండా ఉండలేక మంగళవారం రాత్రి ఇమ్రోజ్​ పటేల్ తాను​ నివసించే ఫ్లాట్​ నుంచి ఆ యువతికి ఫోన్​ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ యువతితో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి వెంటనే అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోన్​లో విషయం చెప్పింది. వెంటనే అతడిని ఇమ్రోజ్​ పటేల్​ ఫ్లాట్​కు వెళ్లాలని సూచించింది.

ఆమె చెప్పిన వెంటనే అక్కడికి వెళ్లిన అతడు అప్పటికే ఇంట్లో దుప్పటిటో ఉరివేసుకొని ఇమ్రోజ్​ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు వెంటనే రాజేంద్రనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. ఇంకా ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. యువకుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట - Lovers Committed Suicide

17 ఏళ్లకే జాతీయ అవార్డ్​ - తనకన్నా 26 ఏళ్ల పెద్ద వ్యక్తితో పెళ్లి, ఆపై సూసైడ్ - ఎవరా నటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.