ETV Bharat / state

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దివ్యాంగులకు ప్రత్యేక ఓపీ సేవలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 10:13 AM IST

Warangal MGM Special OP Service For Disabled : నిత్యం వేలాది మంది రోగులతో కిటకిటలాడే వరంగల్ ఎంజీఎం ఆసుప‌త్రిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఓపీ సేవలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ చొరవతో ఈ సేవలను ప్రారంభించినట్లు ఆసుప‌త్రి సూపరింటెండెంట్ తెలిపారు. తమ కోసం ప్రత్యేకంగా ఓపీ సేవలు ప్రారంభించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MGM Special OP Services
MGM Disabled Peoples Op In Warangal

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు - హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగులు

Warangal MGM Special OP Service For Disabled : ఉత్తర తెలంగాణకి ఆరోగ్య ప్రధాయినిగా భావించే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు గంటలు తరబడి క్యూలో వేచి ఉండాల్సివస్తోంది. ఈ తాకిడిని తట్టుకుని చికిత్స చేయించుకోవాలంటే సాధారణ రోగులకే కత్తిమీదసాము లాంటిది. అలాంటిది దివ్యాంగులైతే ఇక చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను వివిధ సంఘాలు అనేకసార్లు నిరసనలు, ధర్నాలు చేపట్టి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఎంజీఎం వైద్యుల 'ఓపెన్ హార్ట్‌ సర్జరీ' విజయవంతం.. చరిత్రలోనే ఓ మైలురాయిగా..

"దివ్యాంగులకు ఓపీ సేవలు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. జిర్యాట్రిక్​ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయ్యింది. సిబ్బంది అసోసియేట్​ నుంచి చాలా సార్లు రిప్రజెంట్​ చేశారు. ఎంజీఎం ఆసుపత్రిలో స్థలం కొరత ఉంది. దివ్యాంగులకు కోసం ప్రత్యేక ఓపీ ప్రారంభించాం. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓపీ ఉండాలని, ఇతర రోగులు పాటు ఇబ్బందులు పడకూడదని వారికంటూ ఒక వైద్యుడితో వైద్యం అందించాలనుకున్నాం. జర్వం, దగ్గు, బీపీ, హైపర్​ టెన్షన్ వీటి కోసం కూడా పెద్ద క్యూలైన్​లో నిలబడాలంటే కష్టం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం అలోచిస్తున్నాం.​" - డా.చంద్రశేఖర్, సూపరింటెండెంట్, ఎంజీఎం, వరంగల్‌

Oxygen : ఎంజీఎంకు రూ.20లక్షలు విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

MGM Special OP Services : జిల్లా కలెక్షర్‌ ఆదేశాలతో వృద్ధులకు సేవలందించే వార్డు పక్కనే దివ్యాంగులకు ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో ఇక్కడ ఓపీ అందుబాటులో ఉంటాయని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్ తెలిపారు. సాధారణ వ్యక్తులతో పోటీపడి ఇన్ని రోజులూ చికిత్స కోసం క్యూలో ఎదురుచూడాల్సి వచ్చేదని తమ సమస్యలు గుర్తించి సహకరించినందుకు అధికారులకు దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు.

"సాధారణ వ్యక్తులతో పోటీ పడి మేం క్యూలైన్​లో నిలబడుతున్నాం. వీల్​ఛైర్​లో ఉండి కూడా క్యూలైన్లలో వేచి చూస్తున్నాం. మాకు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మా సమస్యలు గుర్తించి లైన్​లో ఎక్కువ సేపు నిలబడకుండా ప్రత్యేకమైన ఓపీ కల్పించినందుకు ఆనందిస్తున్నాం. ఇదే విధంగా తెలంగాణలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం." - దివ్యాంగుల సంఘం నాయకులు

మెడికల్ హబ్‌గా ఓరుగల్లు.. వేగంగా అడుగులు

వరంగల్​ ఎంజీఎంలో సౌకర్యాల కల్పనలో విఫలం: శ్రీధర్​ బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.