ETV Bharat / state

అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ - 80 శాతానికి చేరువలో ఓటింగ్​ - Voters Crowd at Polling Centers

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 8:16 PM IST

Updated : May 14, 2024, 6:19 AM IST

Voters Crowd at Centers Even After Polling Time Across the State: పోలింగ్‌ సమయం ముగిసిన రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి ఓటింగ్ మందకొడిగా సాగుతూ ఉండడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎంత సమయమైనా ఓటు వేస్తామని చెప్పి అనుకున్నట్లుగానే ఓటు వేసి వెళ్లారు.

voters_crowd_at_polling_centers
voters_crowd_at_polling_centers (Etv Bharat)

Voters Crowd at Centers Even After Polling Time Across the State: ఓటింగ్ ప్రక్రియ ముగిసే నిర్ణీత సమయానికి కల్లా క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో క్యూ లైన్​లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Krishna District: పోలింగ్‌ సమయం ముగిసిన రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కొనసాగింది. కృష్ణా జిల్లా పెడన బంగ్లా హై స్కూల్ పోలింగ్ బూత్ లో జనాలు ఓటేసేందుకు క్యూ లైన్ వేచి ఉన్నారు. అధికారుల సమాచారం మేరకు పోలింగ్‌ 10 గంటల వరకూ కొనసాగినట్లు తెలుస్తోంది. గన్నవరం, గొల్లనపల్లి, కొండపావులూరు, పెద్దఅవుటపల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, తేలప్రోలు, ఇందుపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ కొనసాగింది. బాపులపాడు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని పోలింగ్‌ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో బారులు తీరారు. ఓటింగ్‌ నిదానంగా సాగుతున్న తీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ - బూత్​ల వద్ద వైఎస్సార్సీపీ నేతల భీభత్సం - Joint Chittoor district Elections

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో సాయంత్రం అయినప్పటికి ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. సాయంత్రం నాలుగుగంటల సమయానికి 60శాతం పోలింగ్ నమోదు అయింది. 1200 మంది ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ప్రత్యేక లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. తిరువూరు పట్టణంలోని చింతల కాలనీలో 81, 82 బూత్​లలో ఓటు వేసేందుకు వందలాదిగా ఓటర్లు వచ్చారు. ఉదయం నుంచి ఓటింగ్ మందకొడిగా సాగుతూ ఉండడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడ శివారు పాయకాపురం కండ్రిక బీవీ సుబ్బారెడ్డి హైస్కూల్లో ఓటింగ్​ ముగిసే సమయానికి క్యూ లైన్​లో ఓటర్లు బారులు తీరారు. వికలాంగుల సైతం ఓటు ఓటు వినియోగించుకున్నారు. ఎంత సమయం అయినా గాని ఓటు వేసి ఇంటికి వెళ్తామని ఓటర్లు చెప్పారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు - అడ్డొచ్చిన వారిపై దాడులు - YSRCP Leaders Attack TDP Leaders

YSR District: వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కొన్ని ఘటనలు మినహా మొత్తం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తిరువెంగళాపురం, చింతలచెరువు, చిన్నకేశంపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద కొద్దిసేపు ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు చొరవతో ఆ వాగ్వాదం సద్దుమణిగింది. మొత్తం పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Nellore District: నెల్లూరు నగర నియోజకవర్గంలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ సమయం ఆరు గంటలకు ముగిసినా, ఇంకా క్యూలైన్​లలో ఓటరులు బారులు తీరారు. క్యూ లైన్​లో ఉన్న ఓటర్లకు ఓటు వినియోగించుకునే అవకాశం అధికారులు కల్పించారు. ఆర్ఎస్ఆర్ పాఠశాల, సుబేదారుపేట సెయింట్ జాన్స్ పాఠశాలలో భారీగా ఓటర్లు బారులు తీరారు. వీరంతా ఓటు వినియోగించుకునే సరికి మరింత సమయం పట్టింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రాత్రి 7 గంటలైనా ఓటింగ్ కొనసాగింది. నియోజవర్గంలోని వెంకటాచలం అనికేపల్లి , నిడిగుంటపాలెం, సర్వేపల్లి తదితర గ్రామాలలో ఓటింగ్ కొనసాగింది. రాత్రి 10 గంటల వరకు కొనసాగినట్లు సమాచారం.

తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం - అడిషనల్ ఎస్పీపై రెచ్చిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - Pedda Reddy Comments On Police

Anakapalli District: అనకాపల్లి నియోజకవర్గంలో ఓటు వేయడానికి ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు సందడి నెలకొంది. అనకాపల్లిలోని గవరపాలెం గౌరీ పరమేశ్వర ఆలయం వద్ద పోలింగ్ బూత్​లో ఈవీఎంలు పని చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం దాటిన ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడ్డారు.

Alluri Sitaramaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ జీకే వీధి మండలం రింతాడ, ఏబులం, చింతపల్లి మండలం కిన్నర్ల లో వర్షంలోనూ ఓటర్లు క్యూలు కట్టి ఉన్నారు. ఓ పక్కన వర్షంలో తడుస్తూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చివర వరకు ప్రయత్నం చేశారు. సమయం అయిపోయినప్పటికీ క్యూలో ఉండటం వలన అధికారులు ఓటింగ్ నిర్వహించారు.

Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికల సమయం పోలింగ్ సమయం ఆరు గంటలు కావడంతో వచ్చిన ప్రజలకు స్లిప్పులు అందజేసి ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు. స్లిప్పులు తీసుకున్న మహిళలు, పురుషులు చీకటి పడినా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. స్లిప్పులు అందజేసిన వారికి మాత్రమే ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు.

Last Updated :May 14, 2024, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.