ETV Bharat / state

కరెంటు తీగల్లో లోపాలను గుర్తించేందుకు థర్మల్‌ విజన్‌ కెమెరాల వినియోగం! - ఆ పరిస్థితులను నివారించేందుకే - Thermal Cameras for Electrical

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 4:11 PM IST

Thermal Imaging Cameras : ఇక నుంచి కరెంటు తీగలలో లోపాలను గుర్తించేందుకు థర్మల్‌ విజన్‌ కెమెరాలను ఉపయోగించనున్నారు. అందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ కూడా నిర్ణయం తీసుకుంది. అసలు ఇవి ఎలా పని చేస్తాయి? వీటినే ఎందుకు కరెంటు తీగలు, పైపులను గుర్తించేందుకు వాడాలి? లాంటి విషయాలను తెలుసుకుందాం?

Thermal Imaging Cameras
Thermal Imaging Cameras (ETV Bharat)

Thermal Imaging Cameras Find Wires and Pipes : కరెంటు తీగలలో కంటికి కనిపించని లోపాలు అనేకం ఉంటాయి. ఈలోపాలను నిరంతరం విద్యుత్ సిబ్బంది పరిశీలిస్తున్నా, కొన్నింటిని మాత్రం పరిశీలించలేకపోతున్నారు. వీటి వల్ల తీగలు వేడెక్కడం, కాలిపోయి మంటలు రావడం, గృహోపకరణాలు కాలిపోవడం, నిత్యం విద్యుత్‌ అంతరాయం ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు ఆ లోపాలను పరిశీలించేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ థర్మల్‌ విజన్‌ కెమెరాలను వినియోగించనుంది. అయితే వాటిని ఎలా వాడుతారు? ఎక్కడ వాడతారు అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం?

థర్మల్‌ విజన్‌ కెమెరాల వల్ల కంటికి కనిపించని లోపాలను గుర్తిస్తారు. ఆ కెమెరాల ద్వారానే స్కాన్‌ చేసి సమస్య ఎక్కడ ఉందో? ఎంత తీవ్రత ఉందో అర్థమవుతుంది. తద్వారా డిస్కం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే వీటిని ప్రతి సెక్షన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సిబ్బందికి పెను సవాల్‌గా లైన్లు గుర్తింపు : హైదరాబాద్‌ నగరంలో 57 వేల సర్క్యూట్‌ కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, 22 వేల సర్క్యూట్‌ కిలోమీటర్ల 11 కేవీ లైన్లు, 5 వేల సర్క్యూట్‌ కిలోమీటర్ల 33 కేవీ తీగలు ఉన్నాయి. వీటిని విద్యుత్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా, చాలా చోట్ల మాత్రం లోపాలను గుర్తించలేకపోతున్నారు. దీంతో తీగలు కాలిపోయి మంటలు రావడం, తీగలు వేడెక్కడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడం, ఇంట్లో ఉండే వస్తువులు కాలిపోవడం జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీగలు కాలే దశకు ముందే నివారించే విధంగా డిస్కం ఆలోచన చేస్తోంది. ఇందుకు థర్మల్‌ విజన్‌ కెమెరాలు ప్రధాన పాత్ర వహిస్తాయని డిస్కం అభిప్రాయం.

అసలు థర్మల్‌ విజన్‌ కెమెరా సాంకేతికత అంటే ఏంటి? : విద్యుత్‌ తీగల నుంచి వెలువడే ఉష్ణోగ్రతను థర్మల్‌ కెమెరాలు సంగ్రహించి థర్మల్‌ ఇమేజింగ్‌ చిత్రాలు అందిస్తాయి. దీని ఆధారంగానే ఉష్ణోగ్రత తీవ్రతను తెలుసుకుంటారు. ముఖ్యంగా నిర్మాణరంగంలో ఎక్కువగా థర్మల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ టెక్నాలజీని ప్రస్తుతం చీకట్లో వన్యప్రాణులను ట్రాక్‌ చేయడానికి, భవనాల్లో కనిపించని కరెంటు తీగలు, పైపులను వెతకడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వేడెక్కుతున్న కరెంటు తీగలు ద్వారా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అందుకే పైకప్పులు, గోడలకు నష్టం జరగకుండా లోపల ఉన్న తీగలను కచ్చితంగా అంచనా వేసి ప్రమాదాలను, డబ్బును వృథా కాకుండా చూస్తోంది. ఇప్పుడు విద్యుత్‌ పంపిణీ సంస్థ దీన్ని వాడుకోవాలని చూస్తోంది.

విద్యుత్​ సరఫరాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు - పోకిరీలపై ఎస్పీడీసీఎల్​ సీరియస్​ - Spdcl Serious On False Publicity

'కూల్​ రూఫ్'​ వాడండి ఇంటిని చల్లబరచడమే కాదు - విద్యుత్​ ఆదా కూడా చేస్తుంది - Benefits of Cool Roofs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.