ETV Bharat / state

మేడారం ఎఫెక్ట్​తో రెగ్యులర్ సర్వీసుల్లో తగ్గింపు - సాధారణ ప్రయాణికులు సహకరించాలని సజ్జనార్ రిక్వెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 2:13 PM IST

RTC MD Sajjanor Tweet For Medaram Transport
RTC MD Sajjanor

TSRTC MD Sajjanar Tweet On Medaram Buses : మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక బస్సుల వల్ల రెగ్యులర్ సర్వీసులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జాతర సమయంలో సాధారణ పౌరులు పెద్దమనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

TSRTC MD Sajjanar Tweet On Medaram Buses : తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క - సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్త జన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్‌టీసీ నడుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నట్లు టీఎస్​ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Medaram Special Buses : రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్‌టీసీ నడుపుతోంది. జాతరకు వెళ్లే మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్ద మొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున రెగ్యులర్ సర్వీసులు తగ్గిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్​బంప్స్ గ్యారంటీ

TSRTC Special Buses for Medaram : జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర అయిపోయేంత వరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మేడారంలో ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో బస్​ పార్కింగ్​, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, క్యాంటీన్, మరుగుదొడ్లు ఏర్పాటుతో పాటు, ప్రయాణీకులు బస్సులు తిరిగి వెళ్లే క్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బస్సుల సంఖ్య పెంచగా, కార్మికులు పెరుగుతుండడంతో గతంలో రెండు ప్యూరిఫైడ్​ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, ఈసారి నాలుగింటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

TSRTC Special Buses for Medaram : మరోవైపు మేడారంలో ట్రాఫిక్​ క్రమబద్ధీకరణ కోసం కమాండ్​ కంట్రోల్ రూమ్​, కార్మికులకు 160 రెస్ట్​ రూమ్​లు, ఒక్క రూమ్​లో 15 మంది సిబ్బంది ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. అలాగే బస్సులు మొరాయించిన సమయంలో వాటిని ఆగమేఘాల మీద తరలించేందుకు 12 రిలీఫ్​ వ్యాన్లు, 2 క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఈ జాతరలో మొత్తం 15 వేలకు పైగా అధికారులు, సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని వరంగల్ రీజినల్​ మేనేజర్ శ్రీలత తెలిపారు. జాతర(Medaram Jatara) సమయంలో భక్తుల ప్రయాణ ఇబ్బందులను ఆర్టీసీ సేవలందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు లక్షల మంది భక్తులు బస్సుల ద్వారా మేడారానికి వెళ్లగా, ఈ జాతరకు దాదాపు 30 లక్షల మేర ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

మరోరెండ్రోజుల్లో జనజాతర - మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.