ETV Bharat / state

'దిల్లీ చలో'కు మద్దతుగా గ్రామీణ భారత్‌ బంద్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 8:01 PM IST

Bharat Bandh Kisan Andolan in Bhadradri
Grameen Bharat Bandh in Support of Delhi Chalo Agitation

Telangana Gramin Bharat Bandh in Support of Delhi Chalo : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రమంతటా చేపట్టిన సార్వత్రిక సమ్మె దిగ్విజయంగా సాగింది. కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన చేపట్టారు. కార్పొరేట్‌ శక్తులు తలొగ్గి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.

'దిల్లీ చలో'కు మద్దతుగా గ్రామీణ భారత్‌ బంద్‌ - కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలు వద్దంటూ డిమాండ్‌

Telangana Gramin Bharat Bandh in Support of Delhi Chalo : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వరంగల్ జిల్లా నర్సంపేటలో అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని నినదించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(Arts and Science College) నుంచి కార్మిక సంఘాల నేతలు కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా ప్రధాని మోదీ కర్షకుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. వరంగల్‌లో పోచమ్మ మైదాన్ కూడలిలో కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు.

Bharat Bandh Kisan Andolan in Bhadradri : భద్రాద్రి జిల్లా ఇల్లందులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలువు న్యూడెమొక్రసీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మంలో కార్మిక సంఘాల నాయకులు బస్సు డిపో ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. అన్నదాతల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. మధిరలో ఆందోళనకారులు బ్యాంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను(Government Offices) మూసి వేయించారు. భద్రాచలంలో అఖిలపక్షం నేతలు సార్వత్రిక సమ్మెలో పాల్గొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Farmers Protest for MSP Demands : నల్గొండ గడియారం కూడలిలో కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌లో ఇందిరా సెంటర్‌ నుంచి గాంధీ పార్క్ వరకు అఖిలపక్ష నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌, వామపక్షాల ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు.

రైతుబంధుకు అనుమతి తెచ్చిన సీఎం- దళిత బంధుకు ఎందుకు తేలేదు : రేవంత్ రెడ్డి

కేంద్రం స్పందించేంత వరకు పోరాడతామన్న ఆందోళనకారులు వ్యవసాయ కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని కోరారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దపెట్టున నిరసనలతో హోరెత్తించారు. నిర్మల్‌ ఆర్డీఓ కార్యాలయం(RDO Office) ఎదుట వామపక్ష సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

Trade Unions Concerns For MSP : జగిత్యాల కలెక్టరేట్ ఎదుట కేంద్ర వైఖరిని తప్పుపడుతూ కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్రం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినదిస్తూ రాస్తారోకో చేపట్టారు. 22 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు.

దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్​ గ్యాస్​ ప్రయోగం

హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం కార్మికులు ధర్నా నిర్వహించారు. రూ.25 లక్షల ప్రమాద బీమా(Accident Insurance), ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక కోటా, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరారు. నిజామాబాద్‌లో చేపట్టిన నిరసనలో కార్మికులకు 8 గంటల పని దినంతో పాటు కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి వామపక్ష సంఘాలు ధర్నా చేపట్టాయి. రైతుల పాలిట శాపంగా మారిన కొత్త విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు.

Bharat Bandh Today : హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో కార్మికులకు కనీస వేతనం, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కార్మిక,రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. చేవెళ్లలో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిని ఆందోళనకారులు దిగ్బంధించారు. బీజేపీ హయాంలో(BJP Govt) అన్ని వస్తువుల ధరలు పెరిగి, శ్రామికుల కనీస వేతనాలు తగ్గిపోయాయని ఆరోపించారు. మోదీ సర్కార్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.

రైతులతో కేంద్రం మూడో విడత చర్చలు- శుక్రవారం భారత్ బంద్- ఇంటర్నెట్ బ్యాన్ పొడగింపు

'పాజిటివ్'గానే సాగాయ్​- కానీ మరోసారి రైతులతో చర్చలు : కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.