ETV Bharat / state

''దిల్లీలో మోదీ - మరోసారి' ఎవరూ ఆపలేరు - బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పరస్పర ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించే యత్నం'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 12:05 PM IST

Telangana BJP Chief Kishan Reddy Comments on BRS : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు ఒక సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టం ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర రెండో రోజు సందర్భంగా నారాయణపేటలో ఆయన మాట్లాడారు.

Telangana BJP Chief Kishan Reddy Comments
Telangana BJP Chief Kishan Reddy Comments on BRS

Telangana BJP Chief Kishan Reddy Comments on BRS : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ (BRS) పోటీ చేయాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్​ఎస్​కు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బీఆర్​ఎస్​కు ఒక సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) రెండో రోజు సందర్భంగా నారాయణపేటలో మాట్లాడారు. ఈ సమయంలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్​ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్​ ప్రదేశ్​లో అన్ని ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని కిషన్​ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటకలో 25 సీట్లు గెలుస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్​ 3-4 పార్లమెంటు సీట్లు(Loksabha Election 2024) గెలిచినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిచేందుకే బీజేపీ పోటీ చేస్తోందని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. అధిక సీట్లు కమలం పార్టీ గెలవకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.

BJP Vijaya Sankalpa Bus Yatra : ఓవైసీలు, కేసీఆర్​లు, రాహుల్​ ఎవరూ మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఆపలేరన్నారు. ఇక్కడ అప్పుడే కాంగ్రెస్​పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని దుయ్యబట్టారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సోనియా కుటుంబానికి సేవ చేయడం తప్ప, హామీల అమలుపై కాంగ్రెస్(Congress)​ దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలని కాంగ్రెస్​ నాయకులను నిలదీశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ సహా ఇతర హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం(Woman Free Bus) ద్వారా మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు.

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై ఛార్జిషీట్ వాస్తవైతే ఎందుకు చర్యలు లేవు : ఇక్కడ 17 ఎంపీ సీట్లు గెలిచి, రాహుల్​ ప్రధాని అయితే, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలు కాకపోవచ్చని కాంగ్రెస్​ చెప్పకనే చెబుతోందని అన్నారు. బీఆర్​ఎస్​-కాంగ్రెస్​ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై ప్రకటించిన ఛార్జ్​షీట్​ వాస్తవమైతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రెండూ ఒక్కటేనని అవినీతి, దోపిడీ, కుటుంబ పార్టీలేనని తెలిపారు.

10 ఎంపీ సీట్లకు పైగా గెలవడమే లక్ష్యం - పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కమలదళం

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.