ETV Bharat / state

జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పండి : సుప్రీంకోర్టు - jagan disproportionate assets case

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 11:10 AM IST

Updated : Apr 1, 2024, 12:05 PM IST

Etv Bharat
Etv Bharat

Supreme Court on AP CM Jagan Disproportionate Assets Case : ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నిచింది. ఇందుకు గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Supreme Court on AP CM Jagan Disproportionate Assets Case : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసుపై (CM Jagan Illegal Assets) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

CM Jagan Illegal Assets Case : డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు సుప్రీంకోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్‌ సవ్యంగానే జరుగుతోందని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదని, అఫిడవిట్‌ ఎందుకు ఫైల్‌ చేయలేదో చెప్పాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు.

CBI Court On Jagan: 'కేసుల విచారణకు జగన్‌ ఎందుకు హాజరు కావడంలేదు?'

ముఖ్యమంత్రి అన్న కారణంగానే ట్రయల్‌ ఆలస్యం అవుతోందనేది ప్రధాన ఆరోపణ, దానికి ఏం సమాధానం చెపుతారని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ట్రయల్‌ సుదీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే ట్రయల్‌ను వేగంగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్‌ రద్దు, హైదరాబాద్‌ నుంచి ట్రయల్‌ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో ఆలస్యం ఎందుకు? - సీబీఐకి సుప్రీంకోర్టు సూటిప్రశ్న

Last Updated :Apr 1, 2024, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.