ఇల్లే గ్రంథాలయం - అందుకే పద్మ శ్రీ పురస్కారం - డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గురించి ఈ విషయాలు తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 1:03 PM IST

Dr. Kurella Vittalacharya Got Padma Sri Award

Special Story on Dr Kurella Vittalacharya : విజ్ఞానానికి పునాది పుస్తకం. మనిషి ఎదుగుదలలో కూడా దీనిది కీలక పాత్ర. అలాంటి పుస్తకాలనే జీవితంగా చేసుకున్న సరస్వతీ పుత్రుడు డాక్టర్​ కూరెళ్ల విఠలాచార్య. పల్లె సీమల్లో సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ అసమాన కృషి చేస్తున్నారు. ఇంటినే గ్రంథాలయంగా మార్చి ప్రజలకు విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఈయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. విఠలాచార్య సేవలకు సరికొత్త గుర్తింపు ఇచ్చింది. రచనా వ్యాసంగంలోనూ ఈయన చేసిన కృషి అసమానం. తన నిరుపమాన సేవలకు విఠలాచార్య ప్రధానమంత్రి మొదలు అనేక మంది ప్రశంసలు అందుకున్నారు.

ఇంటినే గ్రంథాలయంగా మార్చిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య - మన్​కీ బాత్​లో ప్రధాని నరేంద్రమోదీ ప్రశంస

Dr. Kurella Vithalacharya Got Padma Sri Award : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ(Padma Sri) పురస్కారానికి ఎంపికైన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను ఊరికే ఆ పురస్కారం వరించలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఈయన విద్యావ్యాప్తిలో చేసిన కృషి అసమానం. తెలుగు ఉపాధ్యాయుడిగా, రచయితగా పని చేసిన ఆయన తన ఇంట్లో 5 వేల సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రజలు కూడా తోడ్పాటు అందించడంతో ప్రస్తుతం ఇక్కడ 2 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలోని పుస్తకాల సహాయంతో పరిశోధనలు చేసి 17 మంది డాక్టరేట్​ పట్టా పొందడం విశేషం.

పింఛన్​ డబ్బులతోనే గ్రంథాలయం ఏర్పాటు : ఇటీవల ఆ ఇంటిని కూల్చి దాతల సహకారంతో 50 లక్షల రూపాయలతో నిర్మించిన భవనంలో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. కూరెళ్ల విఠలాచార్య స్ఫూర్తితో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 12 గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ కృషికే పద్మశ్రీ పురస్కారం వరించింది. కూరెళ్ల విఠలాచార్య తల్లిదండ్రులు కూరెళ్ల లక్ష్మమ్మవెంకట రాజయ్య. 1938లో జన్మించిన ఈయనకు ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రి దూరమయ్యారు. తల్లి లక్ష్మమ్మ అనేక కష్టాల పడింది. ఆమె కష్టాలను చూసిన మేనమామ విఠలాచార్యను తీసుకువెళ్లి చదివించారు. అయితే చదువుతో పాటే రచనలపై కూడా ఆయన ఆసక్తి పెంచుకున్నారు ఆయన. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.

తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డలకు 'పద్మ' పురస్కారం - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన : సొంత గ్రామంలోనే ప్రధానోపాధ్యాయుడిగా పని చేశారు. 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకుడిగా విధులు నిర్వహించారు. ఆ క్రమంలోనే తెలుగులో గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన చేసి విఠలాచార్య 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రామన్నపేట పరిసర ప్రాంతాల్లో పలు సాహితీ సంస్థలను స్థాపించి యువ కవులను, రచయితలను ప్రోత్సహించారు. వారి రచనలను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పడు భువనగిరి మండలం వడాయిగూడెంలో అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించి వయోజనులకు రాత్రివేళల్లో చదువు నేర్పించారు.

కూరెళ్ల విఠలాచార్యని వరించిన పద్మశ్రీ : కూరెళ్ల విఠలాచార్య ఆ ఉద్యమాన్ని ఊరూరా వ్యాప్తి చేసేందుకు కృషి చేశారు. ఈయన అక్షరాస్యత ఉద్యమం స్ఫూర్తితో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదువు - వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఠలాచార్య చేస్తున్న సమాజ సేవను అభినందించారు. చిన్నప్పడు తాను చదువుకోవడానికి సరైన వసతి లేదని పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేవి కావన్నారు విఠలాచార్య. చదువుకునేందుకు తాను పడిన కష్టాలు మరెవరూ పడవద్దని తన ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. 14 ఎళ్ల వయసులోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత విఠలాచార్యది. ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులుగా మార్చేందుకు చేసేందుకు ఈయన ఊరూరా గ్రంథాలయం ఉద్యమాన్ని ప్రారంభించారు.

'పద్మశ్రీ'కి అవమానం.. నడిరోడ్డుపైకి 90 ఏళ్ల కళాకారుడు

డాక్టర్ విటలాచార్యకు ప్రధాని ప్రశంస : మన్​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) డాక్టర్. కూరెళ్ల విఠలాచార్యను ప్రశంసించారు. ఆయన సేవలను అభినందించారు. మోదీ ప్రశంసలతో తాను పుట్టిన ఊరికి సరికొత్త గుర్తింపు లభించిందన్నారు ఆయన. గ్రంథాలయం పుణ్యాన తమ గ్రామం యాత్ర స్థలంగా మారిందన్నారు. తెలంగాణ సాధనలో కూడా విఠలాచార్య తనదైన ముద్రను చూపించారు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోతన పేరు పెట్టాలని ఉద్యమం కూడా చేశారు. తనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు విఠలాచార్యలు విఠలాచార్య గ్రంథాలయంలో పిల్లల నుంచి పెద్దవారికి కావాల్సినవితో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు పరిశోధన విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. గ్రంథ భిక్షకై అభ్యర్థన పేరుతో ఆయన పుస్తకాలు సేకరించారు.

వడాయిగూడెంలో అక్షరాస్యత ఉద్యమం : గ్రంథాలయాన్ని తనకు వచ్చే పింఛన్​ డబ్బులతోనే నిర్వహిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అరుదైన విశిష్ట పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా డాక్టర్​ కూరెళ్ల అందుకున్నారు. కూరెళ్ల విఠలాచార్య అనేక పుస్తకాలు రాశారు. చద్దిమూటలు, వంద శీర్షికలు వందసీసాలు ఇలా సుమారు 30 పైగా పుస్తకాలు రాశారు. ఇందులో 22 పుస్తకాలు మాత్రమే ప్రచురితమయ్యాయి. వీటిలో బాగా నచ్చిన పుస్తకం విఠలేశ్వర శతకమని డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. పట్టణంలో ఉన్నావారు పల్లెబాట పట్టాలని పల్లెలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతోందని విఠలాచార్య అంటున్నారు.

Dr.Kurella Vittalacharya : ఆయనకు పద్మశ్రీ ఆవార్డు రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, గ్రంథ పాలకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఆకృతి చేస్తాయి. పుస్తకాలు చదవడం ద్వారా అద్భుతమైన సంతృప్తిని ఇస్తుంది. పుస్తక పఠనాన్ని చిన్నప్పడు నుంచే ప్రాచుర్యంలోకి తీసుకురావాలని యువత పుస్తకాలు బాగా చదవాలని డాక్టర్. కూరెళ్ల విఠలాచార్యులు కోరుతున్నారు.

Padma Sri Award To Mogilayya: కిన్నెర రాగానికి పులకరించి.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ..

పద్మ భూషణ్​ స్వీకరించిన పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.