ETV Bharat / state

ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో రాణిస్తున్న యువతి - సినిమా ఛాన్స్​ కూడా కొట్టేసిందిగా - Special Story Of Fashion Designer

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 4:37 PM IST

Special Story Of Fashion Designer Pooja : సొంతంగా ఎదగాలనేది ఆ యువతి చిన్ననాటి కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా కృషి చేసింది. తాతయ్య చూపిన మార్గం అమ్మ చెప్పిన ధైర్యంతో ముందుకు సాగి ఎదురైన అవరోధాలను అధిగమించింది. వస్త్ర డిజైనింగ్‌లో అడుగుపెట్టి యువతను ఆకర్షించేలా వస్త్రాలు తయారు చేస్తోంది. మార్కెట్‌లో తనదైన మార్క్‌ చూపిస్తూ వినూత్నంగా రాణిస్తోంది. ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా పని చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది. మరి, ఆ యువ డిజైనర్ ఎవరు? తన విజయ గాథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Special Story Of Fashion Designer Pooja
Special Story Of Fashion Designer Pooja

ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో రాణిస్తోన్న పూజా వంగల- రజాకార్‌ సినిమాలో పనిచేసే అవకాశం

Special Story Of Fashion Designer Pooja : భవిష్యత్తు బాగుండాలంటే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవాలని అనుకుంది ఈ అమ్మాయి. అందుకోసం ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై(Fashion Designer) దృష్టి పెట్టింది. అందులోని మెళకువలను వడివడిగా నేర్చుకుంది. తన పేరునే ఒక బ్రాండ్‌గా మలచి డిజైనర్‌ స్టూడియోను ప్రారంభించింది. అంతేకాదు, వస్త్ర డిజైనింగ్‌లోకి అడుగుపెట్టిన ఆనతి కాలంలోనే సినిమా ఆఫర్‌ కొట్టేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది.

Young Girl Excels In Fashion Designing : వస్త్రాలపై ఎలాంటి డిజైనింగ్‌ వేయాలో పేపర్‌పై నమూనా గీస్తున్న ఈ యువ డిజైనర్‌ పేరు పూజ వంగల. కరీంనగర్‌ స్వస్థలం. పూజకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ దుస్తులంటే మహా సరదా. కాగితాలపై రకరకాల బొమ్మలు గీస్తూ అమ్మకు చూపించి మురిసిపోయేది. అలా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పై పెరిగిన ఇష్టంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పరీక్ష రాసింది. చైన్నైలో సీటు రావడంతో నాలుగేళ్ల పాటు అక్కడే ఉండి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది.

పేరునే బ్రాండ్​నేమ్​గా మార్చుకుని : ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ పూర్తి చేసిన తర్వాత పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది పూజ. అంతా సాఫీగానే సాగుతున్న సమయంలో కరోనా(Covid) రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మార్గనిర్దేశనం చేయడంతో సొంతంగా వస్త్రాలను డిజైన్‌ చేయాలని తలచింది. తన పేరునే బ్రాండ్ నేమ్‌గా (Brand Name)మార్చుకుని వస్త్రాలను సొంతంగా డిజైన్‌ చేయడం మొదలు పెట్టానని చెబుతోంది పూజ.

మాదాపూర్​లో స్డూడియో : హైదారాబాద్‌లోని మాదాపూర్‌లో పూజా వంగల పేరుతో స్టూడియోను ప్రారంభించిన పూజ సామాన్య మధ్యతరగతి వారికి బ్రాండెడ్‌ దుస్తులను(Branded Cloths) అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఫ్యాషన్‌ దుస్తుల కోసం యువత షాపింగ్‌ మాల్స్‌ బాట పడుతున్న నేపథ్యంలో వారి అభిరుచులకు అనుగుణంగా దుస్తులపై సరికొత్త డిజైన్స్‌ను రూపొందిస్తూ యువతను ఆకర్షిస్తోంది పూజ. పురుషులకు సంబంధించిన దుస్తులనే ఎక్కువగా డిజైన్‌ చేస్తున్నానని చెబుతోంది ఈ యువ డిజైనర్‌. వస్త్ర డిజైనింగ్ రంగంలో మార్కెట్‌తో పోటీపడుతూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది పూజా. వ్యాపారం అంటే సవాళ్లతో కూడుకున్నదని, అయితే వాటిని అధిగమిస్తూ ముందుకెళితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతోంది.

ఉద్యోగ వేట నుంచి జాతీయస్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వరకు- ఈ యువరైతు ప్రస్థానం సాగిందిలా

Opportunity in Razakar movie : ఫ్యాషన్ డిజైనింగ్‌ మొదలుపెట్టిన అనితికాలంలోనే పూజకు రజాకార్‌ సినిమాలో డిజైనర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా అవకాశం రావడంతో చాలా సంతోషించానని అంటోంది ఈ యువ వ్యాపారవేత్త. చారిత్రక సినిమా(Historical Movie) కావడంతో అందులోని పాత్రలకు న్యాయం చేసేలా కృషి చేశానని వివరిస్తోంది. అంతేకాకుండా ఓ వెబ్‌సరిస్‌కు కూడా ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరించానని ఈ యువతి చెబుతోంది.

కష్టపడాలనే తత్వం, పనిపై శ్రద్ధ లేకుంటే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో రాణించలేమని పూజా చెబుతోంది. మదిలో మెదిలిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెడితే సత్ఫలితాలు వస్తాయని వివరిస్తోంది. ఒకటి రెండు ప్రయత్నాలతోనే అలసిపోవద్దని సరికొత్తగా ఆలోచిస్తే విజయం వరిస్తుందని చెబుతోంది. స్వతహాగా ఎదగాలనే ఆలోచనతో డిజైనింగ్‌ రంగంలోని అడుగు పెట్టింది పూజా. అలుపెరగకుండా కష్టపడితే విజయం ఎలా సొంతం అవుతుందో యువత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది

చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి

లెక్చరర్ ఉద్యోగం వదులుకుని - మిల్లెట్ హోటల్​తో మిరాకిల్ చేస్తున్న యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.