ETV Bharat / state

కడుపులో కత్తులు పెట్టుకుని టీడీపీ, జనసేనతో పొత్తులు: ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి - Special Status Sadhana Samithi

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 1:41 PM IST

Special Status Sadhana Samithi leaders allegations: ఏపీ ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి నేతలు గుంటూరులో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిచేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రధాని మోదీ మెున్న జరిగిన చిలకలూరిపేట సభలో మంత్రుల అక్రమాల గురించి మాట్లాడారని, కానీ జగన్ అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

Special Status Sadhana Samithi
Special Status Sadhana Samithi

Special Status Sadhana Samithi Leaders Allegations : ప్రత్యేక హోదా, పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇలా అన్నింట్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఏపీ ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి నేతలు ఆరోపించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, పి.వి మల్లికార్జునరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

25 ఎంపీ సీట్ల కోసం ఉత్తర భారత జనతా పార్టీ: రాష్ట్రంలో చిలకలూరిపేట సభలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావించని ప్రధాని, అరాచక పాలన చేస్తున్న సీఎం జగన్ పై ఒక్క విమర్శ చేయలేదని చలసాని శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మంత్రుల అక్రమాల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ జగన్ అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కడుపులో కత్తులు పెట్టుకుని తెలుగుదేశం, జనసేనతో పొత్తులు పెట్టుకున్న ఉత్తర భారత జనతా పార్టీ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిచేందుకు కుట్ర పన్నిందని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. దొడ్డిదారిలో అధికారంలోకి రావాలనుకుంటున్న ఉత్తర భారత జనతా పార్టీని రాష్ట్ర ప్రజలంతా ఓడించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి తీరని అన్యాయం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలను భయపెట్టి వారితో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తులతో పెట్టుకుని ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని సాధన సమితి నేత పి.వి. మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా - విభజన హామీల సాధన సమితి యాత్ర చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు.

కడుపులో కత్తులు పెట్టుకుని తెలుగుదేశం, జనసేనతో పొత్తులు

కడప ఎంపీ స్థానం మనదే- 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - TDP workshop

'శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటుగా మీడియాను సైతం మేనేజ్ చేస్తున్నారు. ఈడీతో పాటుగా దర్యాప్తు సంస్థలను బీజేపీ పెద్దలు తమ చేతుల్లో పెట్టుకున్నారు. నేతలపై ఉన్న కేసులను అడ్డుపెట్టుకుని ఏపీలో బెదిరిపులకు పాల్పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తర భారత జనతా పార్టీని ఓడించడానికి కృషి చేస్తాం. ప్రత్యేక హోదా , రాష్ట్ర విభజన ద్వారా వచ్చే ఆదాయానికి తూట్లు పొడిచారు. బీజేపీ నేతలు రాజకీయ నేతలను భయపెట్టగలరు కానీ, రాష్ట్ర ప్రజలను భయపెట్టలేరని తెలుసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ ఓటు ద్వారా బీజేపీకి తగిన బుద్ధి చెబుతారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిలింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజధానికి న్యాయం చేయగలదు. ఈ విషయంలో రాహూల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారు.' -విభజన హామీల సాధన సమితి నేతలు

పార్లమెంట్​కు యువగళం - ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమిచ్చిన తెలుగుదేశం - TDP prioritized Seats To Youthe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.