ETV Bharat / state

అసలేంటి ఈ ఫ్యాబ్రికేటెడ్​ ఇళ్లు? - నెలలోనే ఇంటి నిర్మాణం పూర్తి! - Mobile Houses Trending In Hyderabad

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 8:07 AM IST

Mobile Houses Trending in Hyderabad : ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. పెళ్లి కంటే, ఇల్లు కట్టడమే చాలా సులభమంటోంది ఓ మహిళ. నెలలో ఇల్లు కట్టి, వినియోగదారులు కోరుకున్న చోటికి అవలీలగా తరలిస్తూ ప్రశంసలందుకుంటోంది. విదేశాల తరహాలో హైదరాబాద్‌లో సరికొత్త రకమైన ఇళ్లు నిర్మిస్తూ, మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఆమే, హైదరాబాద్‌కు చెందిన సేవకుల స్రవంతి. ఆరేళ్లుగా పర్యావరణ హితమైన మొబైల్ హౌస్‌లు తయారు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది.

Fabricated Mobile House Trending in Hyderabad
Fabricated Mobile House Trending in Hyderabad (ETV Bharat)

Fabricated Mobile House Trending in Hyderabad : సామాన్యుడి సొంతింటి కల, కలగానే మిగిలిపోతుంది. పిట్ట గూళ్లలాంటి అద్దె ఇళ్లలోనే కాలం గడుస్తోంది. అప్పులు చేసి, ఇల్లు కట్టుకుందామంటే తిప్పలు తప్పడం లేదు. సొంత స్థలం ఉన్నా, ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ ఒత్తిళ్లు ఏవీ లేకుండా ఇంటిని నిర్మించుకోవచ్చని సేవకుల స్రవంతి అన్నారు.

Heavenly Mobile Houses : విదేశాల తరహాలో హైదరాబాద్‌లో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు నిర్మిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, కోరిన డిజైన్లలో ఇంటిని నిర్మించి కోరుకున్న ప్రదేశానికి తరలిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్రవంతి ఎంబీఏ పూర్తి చేసి, ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశారు. సొంతిల్లు నిర్మించుకునే క్రమంలో, ప్రీ-ఫ్యాబ్రికేడెట్ పద్ధతి గురించి తెలుకున్నారు. తాను ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, 2018లో ‍'హెవెన్లీ మొబైల్ హౌస్‌' పేరుతో సంస్థ స్థాపించారు.

సొంత ఇల్లు ఏ ఏజ్​లో కొంటే బెటర్? - HOME BUYING GUIDE INDIA

"నాకోసం నేను ఇళ్లు ఒకటి నిర్మించాలనుకొని, సివిల్‌ వర్కర్స్‌ను కలవటం జరిగింది. అప్పుడు వాళ్లు నిర్మాణానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం అడిగారు. కానీ నాకొక నెలలోనే ఇళ్లు కావాలనుకున్న, అప్పుడు దానికోసం సెర్చ్‌ చేసి, విదేశాల్లో కనిపించే వుడ్ హౌజ్‌లపై అధ్యయనం చేశాను. సివిల్‌ కంటే తక్కువ ఖర్చులో, అంతకంటే నాణ్యతగల ఇంటి నిర్మాణాన్ని చేశాను. అదే ప్రజలకు సైతం అందించటం జరుగుతుంది. ఇప్పటివరకు 200 నుంచి 300 ఇళ్ల నిర్మాణం చేపట్టాను."-సేవకుల స్రవంతి, హెవెన్లీ మొబైల్ హౌస్‌

ఆరేళ్లుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్‌ల తయారీ : స్రవంతి అందించే ఈ మొబైల్ హౌస్‌లకు హైదరాబాద్‌లో డిమాండ్ పెరిగింది. ఫామ్‌ హౌస్‌లు, వ్యక్తిగత గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కోసం వీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణ ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యతతో నిర్మించి ఇస్తున్నామని స్రవంతి చెబుతున్నారు. కూకట్‌పల్లిలో వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి, 40మందికి స్రవంతి ఉపాధి కల్పిస్తోంది.

ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్ దగ్గరి నుంచి గోడలకు వాడే ఫైబర్ సహా ప్రతి విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని స్రవంతి తెలిపారు. తమ దగ్గర 300 రకాలకుపైగా డిజైన్లు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులు కోరుకున్న విధంగానూ అందిస్తామని వివరించారు. రానున్న రోజుల్లో 10 వేల ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు తయారు చేయడమే లక్ష్యంగా స్రవంతి ముందుకు సాగుతున్నారు.

సొంత ఇల్లు Vs అద్దె ఇల్లు - ఏది బెటర్ ఆప్షన్​! - own house vs Rental House

"ఈ పద్ధతిలో ఇళ్లను నిర్మించటంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా టైం లిమిట్‌. కేవలం ఒక నెలలోనే కోరుకున్న విధంగా నివాసం ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా కావాల్సిన చోటుకు హోమ్‌ను తరలించటం జరుగుతుంది. మొత్తంగా మా ఫ్యాక్టరీలోనే హౌస్‌ కంప్లీట్‌గా తయారవుతుంది. అలానే ఇంటికి కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలను మేమే అందిస్తాం. మార్కెట్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులు ఎలా అయితే కొంటున్నామో, అదేవిధంగా మావద్ద ఇళ్లను సైతం అలానే కొనుగోలు చేయవచ్చు."-సేవకుల స్రవంతి, హెవెన్లీ మొబైల్ హౌస్‌

40 ఏళ్లలోపే 'సొంతింటి' కలను నెరవేర్చుకోవడమెలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.