ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సై మొదటి భార్య ధర్నా - SI wife Dharna AT Police Station

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 9:11 PM IST

SI wife Dharna In Front Of Police Station : ఓ ఎస్ఐ భార్య పోలీస్ స్టేషన్​ముందు ధర్నా చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెళ్లిలో జరిగింది. తన భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇవ్వాలనే ఉద్దేశంతో నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. పిల్లలను కూడా భార్యనైన తన వద్ద ఉంచకుండా తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపింది.

SI wife Dharna In Front Of Police Station
SI wife Dharna In Front Of Police Station (ETV Bharat)

SI wife Dharna In Front Of Police Station : విడాకులు ఇవ్వాలని చెప్పి భర్త తనపై వేధిస్తున్నాడని ఓ ఎస్ఐ భార్య పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. వేరొక మహిళతో అక్రమ సంబంధం కారణంగానే తన భర్త విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపిస్తూ సదరు ఎస్ఐ మొదటి భార్య పోలీస్​స్టేషన్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెళ్లిలో జరిగింది.

ఎస్ఐ మొదటి భార్య తెలిపిన సమాచారం ప్రకారం : తన భర్త అయిన కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్ల క్రితం మరో అమ్మాయిని అక్రమంగా వివాహం చేసుకున్నాడని అతడి మొదటి భార్య మానస ఆరోపించారు. ఏడాది క్రితం తనతో పాటు పిల్లలనిద్దరినీ కరీంనగర్​లోని ఓ అద్దెకు ఓ ఇళ్లు తీసుకొని కానిస్టేబుల్​ను కాపలాగా ఉంచాడని ఎస్ఐ భార్య మానస తెలిపింది. విడాకులు ఇవ్వాలని గత రెండు నెలలుగా తనపై చిత్రహింసలకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. కనీసం పిల్లలను కూడా తన వద్ద ఉంచకుండా భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే తన భర్త రెండో వివాహం చేసుకున్నారని మానస ఆరోపించారు.

కొమురవెళ్లి పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఎస్ఐ గురించి అడగ్గా ఆయన సెలవులో ఉన్నారని చెప్పారన్నారు. జిల్లా పోలీసు అధికారులను సంప్రదించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని మానస ఆరోపించారు. ఇప్పటికైనా తన పిల్లలను అప్పగించి తనకు న్యాయం చేయాలని ఎస్ఐ భార్య డిమాండ్ చేశారు. తనకు తన భర్త, పిల్లలు కావాలని ఎస్ఐ భార్య తెలిపారు.

"నా భర్తతో జీవితాన్ని కొనసాగించడానికి నేను సిద్ధంగానే ఉన్నా. నా పిల్లలను నాకు ఇప్పించండి. వారికి ప్రాణాపాయం ఉంది. పిల్లలు నా దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటారు" అని మానస తెలిపారు.

నెల రోజుల్లోనే రెండో పెళ్లి.. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

భర్త ఇంటిముందు వివాహిత ధర్నా : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. తన భర్త తనకు కావాలని డిమాండ్ చేస్తూ ఓ వివాహిత ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే మేడ్చల్- మల్కాజిగిరికి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటకు చెందిన సందీప్ రెడ్డి, శ్రీలతకు 2012లో వివాహమైంది. కొన్నాళ్లు సంసారం బాగానే సాగినప్పటికీ కొద్ది రోజులకు గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి కలిసి ఉండటం లేదని తన భర్త తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు - న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Wife protest for husband : భర్త కోసం పోరాటం.. 'మా ఆయన నాకు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.