ETV Bharat / state

అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు - న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నా

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 7:07 PM IST

Hyderabad Crime News
Wife Protest Against Her Husband at His Home

Wife Protest in Front of Husband House at Hyderabad : హైదరాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధి బాపూజీ నగర్​లో పవిత్ర అనే మహిళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తన భర్త కార్తిక్‌ చంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకున్న రెండు నెలల నుంచి అత్తింటి వారు గృహహింసకు పాల్పడుతూ, అదనపు కట్నం కోసం వేధించేవారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తన కూతురుతో కలిసి నిరసనకు దిగింది.

గృహహింసకు పాల్పడిన భర్త ఇంటి ముందు భార్య ధర్నా

Wife Protest in Front of Husband House at Hyderabad : ప్రభుత్వ ఉద్యోగినని మోసం చేసి పెళ్లి చేసుకొని, గృహ హింసకు(Domestic Violence) పాల్పడిన భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధి బాపూజీ నగర్​లో చోటుచేసుకుంది. ఈ మేరకు వారాసిగూడ పోలీస్ స్టేషన్​లో బాధితురాలు పవిత్ర ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ ఇంటి ముందు నుంచి వెళ్లే ప్రసక్తే లేదని తన కూతురుతో కలిసి నిరసనకు దిగింది.

బిడ్డకు జన్మనిస్తూ భార్య మృతి, రైలు పట్టాలపై భర్త ఆత్మహత్య

సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్సీగుట్ట బాపూజీ నగర్​లో నివాసం ఉంటున్న మాజీ ప్రభుత్వ ఉద్యోగి రాంచందర్ రావు తనయుడు కార్తిక్ చంద్ర, చంపాపేట్ ఎంఆర్​వో(MRO)గా ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి పవిత్రను 2015లో వివాహం చేసుకున్నాడు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగినని నమ్మబలికి తనను పెళ్లి చేసుకున్నాడని పవిత్ర ఆరోపించింది.

నేను కార్తీక్ చంద్ర అనే అతన్ని నవంబర్ 18, 2015లో పెళ్లి చేసుకున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. అతడు కూడా పెళ్లైన సమయంలో ఆరోగ్య శ్రీలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి పెళ్లి చేశారు. కానీ అతడి సహోద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించాడని సర్వీస్ నుంచి తీసేశారు. అనంతరం మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని నా పేరు మీదకు రాయించుకొని రమ్మని మా అత్తామామలు, ఆడపడుచు, నా భర్త అందరూ నన్ను చాలా హింసించారు. - పవిత్ర, బాధితురాలు

Wife Protest Against Her Husband at His Home : పెళ్లి చేసుకున్న రెండు నెలల నుంచి తన భర్త, అత్తమామలు, ఆడపడుచులు గృహహింసకు పాల్పడడం, అదనపు కట్నం కోసం వేధించటం మొదలు పెట్టారని తెలిపింది. అంతేకాకుండా తన అమ్మకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి తనకు కూడా ఆడ పిల్లలే పుడతారని, ఒక పాప పుట్టిన తరువాత బలవంతంగా రెండు అబార్షన్​లు చేయించారని వాపోయింది. తాము బీసీ వర్గానికి చెందినప్పటికీ తన మామ దొంగ సర్టిఫికెట్​తో(Fake Certificate) ఎస్సీ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం చేశారని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.10 లక్షల కట్నం, 40 తులాల బంగారం, 2 కిలోల వెండి ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ముందు నుంచి జరిగేది లేదని స్పష్టం చేసింది.

ఇంటి నిర్మాణానికి రూ.30 లక్షలు తెమ్మని బలవంతం చేశారు. నేను తీసుకురాలేదు. మా అమ్మకు మగపిల్లలు లేరని నాకూ అదేవిధంగా ఆడపిల్ల పుట్టిందని, తరువాత కూడా రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు. మళ్లీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. - పవిత్ర, బాధితురాలు

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడేమైంది?

అత్యాచారం కేసులో యూట్యూబ్​ స్టార్​ చంద్రశేఖర్​ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.