ETV Bharat / state

పది పరీక్షల్లో కొత్త విధానం - ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 7:51 PM IST

QR_Code_System_in_Tenth_Class_Exams
QR_Code_System_in_Tenth_Class_Exams

New System in Tenth Class Exams: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలపై విశాఖ డీఈవో కీలకాంశాలు వెల్లడించారు. ఈసారి పరీక్షల నిర్వహణలో నిబంధలను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు.

QR Code System in Tenth Class Exams: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతుండగా భద్రతా చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎగ్జామ్ పేపర్​కు ఒక క్యూఆర్ కోడ్​ను ముద్రిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల అక్రమాలకు నివారించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

పరీక్షల టైమ్​లో పిల్లలకు ఈ ఫుడ్స్​ పెడితే - జ్ఞాపక శక్తి ఓ రేంజ్​లో పెరుగుతుంది !

దీంతోపాటు పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలన్నీ నో మొబైల్‌ జోన్లుగా ప్రకటించారు. డీఈవో సహా చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు తీసుకురావడానికి లేదని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే, దానికి బాధ్యులైన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని విశాఖ డీఈవో చంద్రకళ తెలిపారు.

పది పరీక్షల్లో కొత్త విధానం - ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్

"ఈసారి టెన్త్ క్లాస్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎగ్జామ్ పేపర్​కు ఒక క్యూఆర్ కోడ్​ను ముద్రిస్తున్నాం. దీనివల్ల అక్రమాలు నివారించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతోపాటు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లకు అనుమతిలేదు. పరీక్షా కేంద్రాలన్నీ నో మొబైల్‌ జోన్లుగా ప్రకటిస్తున్నాం. డీఈవో సహా చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇతర అధికారులు సైతం పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు తీసుకురావడానికి లేదు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే, దానికి బాధ్యులైన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష. మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి." - చంద్రకళ, విశాఖ డీఈవో

పది పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 18వ తేదీ- ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19వ తేదీ- సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21వ తేదీ- థర్డ్ లాంగ్వేజ్
  • మార్చి 23వ తేదీ- గణితం
  • మార్చి 26వ తేదీ- ఫిజిక్స్
  • మార్చి 28వ తేదీ- బయాలజీ
  • మార్చి 30వ తేదీ- సోషల్ స్టడీస్

పరీక్షా సమయం:

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి.

బోర్డ్ ఎగ్జామ్స్ - మీ పిల్లలను ఒత్తిడితో చిత్తు చేయకండి - ఈ టిప్స్​ పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.