ETV Bharat / bharat

బోర్డ్ ఎగ్జామ్స్ - మీ పిల్లలను ఒత్తిడితో చిత్తు చేయకండి - ఈ టిప్స్​ పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 1:53 PM IST

Stress Management Tips for Students : త్వరలో టెన్త్, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు దగ్గరపడే కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు వారికి మద్దతుగా నిలవాలి. దాంతోపాటు వాళ్లలో టెన్షన్ తగ్గించేందుకు కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Stress
Stress Management Tips for Students

Stress Management Tips for Board Exam Students : బోర్డ్ ఎగ్జామ్స్ అంటే.. పిల్లల్లో ఆందోళన సహజం. మంచి మార్కులు సాధించాలన్న ఆరాటంతో పిల్లల్లో ఒత్తిడి(Stress) అధికంగా ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో పిల్లలు డిప్రెషన్​కులోనై.. నేర్చుకున్నదంతా మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రిలాక్సేషన్ టెక్నిక్స్ : ఫైనల్ పరీక్షల వేళ పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడానికి, తగినంత విశ్రాంతి లభించడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్​లను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అంటే.. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి డైలీ కాసేపు సాధన చేసేలా చూడండి. ఇవి ఒత్తిడి నుంచి వారి దృష్టి మళ్లించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.

తగినంత నిద్ర : పరీక్షల వేళ విద్యార్థుల్లో నెలకొనే ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి తగినంత నిద్ర చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది పిల్లలు రాత్రి, పగలు తేడా లేకుండా చదువుతుంటారు. అతిగా చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. ఇది నిద్రలేమికి కారణమై మరింత స్ట్రెస్​కు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి తగినంత నిద్ర చాలా అవసరం. ఇందుకోసం.. చదువుకు ఒక నిర్ధిష్ట షెడ్యూల్ కేటాయించుకోవాలి.

వ్యాయామం : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే టైమ్ లేదనే భావనతో వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పరీక్షల వేళ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి మీ పిల్లలు రోజులో కొంతసమయం వ్యాయామం చేసేలా చూడండి. వాకింగ్, రన్నింగ్ లేదా ఏరోబిక్స్ వంటి చేయడం ద్వారా చదువులో నిమగ్నమవ్వడానికి కావాల్సిన శక్తినిస్తాయి. అలాగే స్ట్రెస్​ను తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. బాడీని, మనసును ఆరోగ్యంగా ఉంచుతాయి.

Best Ways to Avoid Stress in Children : పిల్లల్ని ఓ కంట కనిపెడుతున్నారా..?

పోషకాహారం : పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాదు.. వారు చదివేటప్పుడు, చదివింది గుర్తుండడానికీ సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీ పిల్లలు డైలీ సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత వాటర్ తాగేలా ప్రోత్సహించండి. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునేలా చూడండి. ఎందుకంటే ఇవి పిల్లల ఏకాగ్రతను పెంచుతాయి.

విరామాలు తీసుకోవడం : పరీక్షల వేళ పిల్లల్లో స్ట్రెస్​ను నివారించడానికి స్టడీ సెషన్​ల మధ్య క్రమం తప్పకుండా విరామం తీసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. కొద్దిసేపు అటూ ఇటూ నడవమని చెప్పండి. ఇలా స్టడీ సెషన్​ల మధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ఫలితంగా పిల్లల్లో ఒత్తిడి స్థాయిలు తగ్గడమే కాకుండా మానసిక స్థితి మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు.

ఇంకా...

పై చర్యలతోపాటు పిల్లలకు రివిజన్​లో సహాయం చేయండి. మీ సమక్షంలో వారి స్నేహితులతో కలిసి కంబైండ్ స్టడీస్ చేసేలా చూడండి. దీనివల్ల వారి రివిజన్ చక్కగా సాగుతుంది. ఇక చాలా మంది పిల్లలు పరీక్షలు దగ్గరికి వచ్చాక చదవడం మొదలుపెడతారు. దానివల్ల ప్రయోజనం శూన్యం. మీ పిల్లలను ఇప్పటి నుంచే ప్రతి సబ్జెక్ట్​ను స్థిరంగా చదువుకునేలా చూడాలి. మంచి టైమ్ టేబుల్ ఫిక్స్ చేసి ప్రోత్సహించాలి. ఇలా చేయడం ద్వారా వారిలో ఒత్తిడిని తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

అలర్ట్‌ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.