ETV Bharat / state

అధిక వడ్డీ ఆశ చూపారు - రూ.200 కోట్లతో ఉడాయించారు - Investment Fraud in Abids

author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 3:18 PM IST

Updated : May 20, 2024, 4:18 PM IST

Investment Fraud in Abids : అధిక వడ్డీల ఆశ చూపి రూ.200 కోట్లతో హైదరాబాద్​లో అబిడ్స్​లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Investment Fraud in Abids
అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్లతో శ్రీ ప్రియాంక సంస్థ మోసం - బషీర్‌బాగ్ వద్ద బాధితుల ఆందోళన (ETV Bharat)

Priyanka Enterprises Fraud : హైదరాబాద్‌ అబిడ్స్‌లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసాలకు పాల్పడి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి 200 కోట్లు రూపాయలను వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా ఇవాళ బషీర్‌బాగ్‌లోని సీసీస్ పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్​ చేశారు.

రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ప్రియాంక జనరల్ మేనేజర్​గా పనిచేస్తున్నారు. ఆమె భర్త నేతాజీకి శ్రీ ప్రియాంక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ ఉంది. అందులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీలు వస్తాయనే ఆమె ప్రలోభ పెట్టింది. ఆధిక వడ్డీ ఆశతో గత కొన్నేళ్లుగా చాలామంది టెస్కాబ్ అధికారులు, పలు జిల్లాల డీసీసీబీల సిబ్బంది ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్​లో డిపాజిట్లు చేసినట్లు బాధితులు తెలిపారు. టెస్కాబ్​లో పనిచేస్తున్న ఆ అధికారిణి మరో మూడు నెలల్లో పదవీ విరమణ పొందనుండగా ఇటీవల హఠాత్తుగా ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లింది.

ఆ వెంటనే కొన్ని రోజులకు ఫైనాన్స్ కంపెనీ మూతపడింది. ఇప్పుడు ప్రియాంక లాంగ్ లీవ్​పై వెళ్లిపోవడం, శ్రీ ప్రియాంక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీకి తాళం వేసి ఉండటంతో తామంతా మోసపోయామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అధిక వడ్డీ ఆశ చూసి తామందరిని మోసం చేశారని వారు వాపోయారు. అధికారిణి అందుబాటులో లేకపోవడంతో పాటు ఆమె భర్త జాడ తెలియకపోవడంతో డిపాజిట్ల చేసిన బాధితులు సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. తాము కొందరమే వచ్చామని, ఇంకా చాలా మంది బాధితులు బయటకు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

'రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్​లో జనరల్ మేనేజర్​గా ఉన్న మహిళ, ఆ బ్యాంక్​లో పనిచేస్తున్న సిబ్బందికి, బ్యాంక్​ వినియోగదారులకు అధిక వడ్డీ ఆశ చూపించారు. ఆమె భర్తకు చెందిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్​ చేస్తే అధిక వడ్డీ వస్తుందని చెప్పారు. దీంతో అందరూ వెళ్లి ఆ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్​లో డబ్బులు డిపాజిట్​ చేశాం. వాళ్లు కంపెనీ బోర్డు తిప్పారని తెలిసి వెంటనే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాం. ఇది ఆర్థిక నేరానికి సంబంధించిందని, దీనిలో బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారని ఫిర్యాదు చేశాం. దీనిపై అధికారులు విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతన్నాం'- శ్రీనివాస్ మూర్తి, బాధితుడు

అధిక వడ్డీ ఆశ చూపారు - రూ.200 కోట్లతో ఉడాయించారు (ETV bharat)

ప్రీ-లాంచ్‌ పేరుతో 350మందికి టోపీ పెట్టిన రియల్టీ సంస్థ - EOW DCP Interview On Free Launch

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు - ఏకంగా రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు - Yashoda Employee Fraud in Hyderabad

Last Updated : May 20, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.