ETV Bharat / state

గతమెంతో ఘనం - నేడు వివాదాల సుడిగుండంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 2:21 PM IST

Panjagutta Police Station
Panjagutta Police Station

Panjagutta Police Station Controversies : హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఒకప్పుడు మోడల్‌ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు పొందిన అక్కడ ఇప్పుడు తరచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎస్‌హెచ్‌వో పోస్టింగ్‌ అంటేనే సీఐలు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొంది.

Panjagutta Police Station Controversies : ఒకప్పుడు దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా గుర్తింపు. హైదరాబాద్‌లోనే కీలకమైన ప్రాంతం. దీని పరిధిలో సుమారు 3.5లక్షల మంది జనాభా. ఐదు సెక్టార్లు. 130 మందికి పైగా పోలీసు సిబ్బంది. అంతటి ప్రాధాన్యత ఉన్న పంజాగుట్ట ఠాణాను వివాదాలు వెంటాడుతున్నాయి. నెలరోజుల డ్రంకన్‌డ్రైవ్‌ కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవటం సంచలనంగా మారింది.

శుక్రవారం రాత్రి పాతబస్తీకి చెందిన అమీర్‌అలీ అనే దొంగ మద్యం మత్తులో కారు నడుపుతూ పంజాగుట్ట వద్ద బీభత్సం సృష్టించాడు. స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు తరలించగా పోలీసుల (Panjagutta Police ) కళ్లుగప్పి పారిపోయాడు. గత నెల 23 అర్ధరాత్రి దాటాక ఖరీదైన కారు మితిమీరిన వేగంతో ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ బారికేడ్లను ఢీ కొట్టింది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ తనయుడు సాహిల్‌ అలియాస్‌ రాహిల్‌ కారు నడిపినట్టుగా నిర్ధారించారు.

ఈ ఘటనలో ఇదే ఠాణాలో అప్పటి ఇన్‌స్పెక్టర్‌ దుర్గారావు స్వయంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని తన కారులో స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించేందుకు అతడిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి పారిపోయిన సాహిల్‌ తన స్థానంలో డ్రైవర్‌ను నిందితుడిగా పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. ఈ వ్యవహారంలో సీఐ సహకరించినట్టు ఉన్నతాధికారుల విచారణలో రుజువు కావటంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు

Cops Suspended in Hyderabad : గతంలో ఇదే పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సమయంలో మద్యం తాగుతూ పట్టుబడ్డారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సై అక్కడకు వచ్చే మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల క్రితం రౌడీషీటర్లతో స్నేహం చేసి పంచాయితీలకు పాల్పడిన ఇదే ఠాణాలో ఓ ఎస్సైను విధుల నుంచి తప్పించారు. పోలీస్ స్టేషన్‌నే వసూళ్ల అడ్డాగా మార్చిన ఒక ఇన్‌స్పెక్టర్‌ను బదిలీ చేసినా రాజకీయ ఒత్తిళ్లతో అదేచోట రెండు సంవత్సరాలు కొనసాగారు.

వివాదాల్లో ఎస్పీలు.. ఐపీఎస్​లను నియమించకపోవడమే కారణమా..?

Cases Against Telangana Police : ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎవరొచ్చినా కొందరు ఎస్సైలు బేరసారాలు ఆడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఈ ఠాణాలో ఎస్‌హెచ్‌వో పోస్టింగ్‌ అంటేనే వెనుకడుగు వేసే పరిస్థితి తలెత్తినట్టు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌ ముందు వరకూ ఇక్కడ ఎస్‌హెచ్‌వో అంటే విపరీతమైన పోటీ ఉండేది. తాజాగా వెలుగు చూస్తున్న వరుస ఘటనలు, వివాదాలతో మొన్నటి వరకూ ఆసక్తిచూపిన సీఐలు ఇక్కడ పోస్టింగ్ అంటేనే ముఖం చాటేసినట్టు సమాచారం.

ఇదేం తీరు పోలీసన్నా - రక్షించాల్సిన మీరే రాంగ్ రూట్​లోకి వెళితే ఎలాగన్నా?

Telangana Police: ఖాకీల అత్యుత్సాహం.. వరుస సంఘటనలతో పోలీసుశాఖకు అప్రతిష్ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.