ETV Bharat / state

దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్​లా సాగదీస్తున్నారు : ఎమ్మెల్సీ కవిత

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 7, 2024, 2:52 PM IST

MLC Kavitha On Delhi Liquor Scam Case : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్​లా సాగదీస్తున్నారని ఆ కేసులో తాను బాధితురాలిని మాత్రమేనని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

MLC Kavitha on Women Reservation
MLC Kavitha Fires On Congress

దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్​లా సాగదీస్తున్నారు : కవిత

MLC Kavitha On Delhi Liquor Scam Case : దిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్​లా రెండున్నరేళ్లుగా సాగదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహానికిలోనయ్యారు. ఆ కేసులో తాను బాధితురాలిని మాత్రమేనని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటామని తెలిపారు. దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నామని రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఆదర్శ్​ స్కాంలో ఉన్న అశోక్ చవాన్​కు రాజ్యసభ సీటు ఇచ్చారని బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారేమోనని వ్యాఖ్యానించారు.

MLC Kavitha on Women Reservation : మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడిన కవిత, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు రాకుండా (G.O 3 in Telangana) జీవో3ను తెచ్చారని విమర్శించారు. మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రేపు ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తునట్టు కవిత తెలిపారు. సీఎం రేవంత్‌ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త ఉత్తర్వులు ఎలా అమలు చేస్తున్నారని నిలదీశారు. 30 వేల నియామకాలు ఇచ్చారని అందులో ఎంత మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది : ఎమ్మెల్సీ కవిత

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మోదీని పొగిడిన రేవంత్ రెడ్డి దాన్ని కప్పి పుచ్చుకునేలా మహబూబ్​నగర్ సభలో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అమలవుతున్నది తెలుగుదేశం ఎజెండా మాత్రమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎత్తిపోయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం ఉందన్న కవిత, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు.

గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని రెండు జాతీయ పార్టీలూ చూస్తున్నాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవకపోతే ప్రజలకే నష్టమన్నారు.

మర్డర్ కేసు నమోదు వల్ల 8 మంది విద్యార్థుల భవిష్యత్తు కాంగ్రెస్ నాశనం చేసింది : కల్వకుంట్ల కవిత

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.