ETV Bharat / state

బీఆర్​ఎస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 7:57 PM IST

MLA Rajgopal Reddy
MLA Rajgopal Reddy Fires on BRS

MLA Rajgopal Reddy Fires on BRS : కేసీఆర్ రాజకీయ వారసుడు హరీశ్​ రావే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అందరు అవమానానికి గురై ఉన్నారని, తమ పార్టీలోకి వస్తే అవినీతి మరకలేని వారినే తీసుకుంటామని అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్​చాట్​లో తెలిపారు.

MLA Rajgopal Reddy Fires on BRS : అవినీతి మరకలేని నేతలనే కాంగ్రెస్​లోకి తీసుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్​చాట్​లో పాల్గొన్న ఆయన లోక్​సభ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్​లో (BRS MLAs) చాలా మంది నేతలు అవమానానికి గురై ఉన్నారన్నారు. డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే ఎలా వాడుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలన్న ఆయన, ఎన్నిసార్లు అధికారంలో ఉంటామనేది ఎవ్వరు చెప్పలేమన్నారు.

హరీశ్​రావు కాంగ్రెస్​లోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం - రాజగోపాల్​ రెడ్డి సెటైర్​

"దేశంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే టాక్ ఉంది. 2029 గురించి ఇప్పుడు ఏం చెప్పలేము. 5 ఏళ్లు మా ప్రభుత్వానికి ఏమి ఢోకా లేదు. ఈటలను ఓడించేందుకు దళితబంధు తెచ్చారు. దళితులపై ప్రేమతో కాదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిది. బీఆరెఎస్ బతకాలంటే హరీశ్​ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి. కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే... పార్టీలో ఒక్కడు ఉండడు. కేసీఆర్ వారసుడు హరీశ్ రావు. హరీశ్​ రావు పార్టీ అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ బతుకుతుంది. కేటీఆర్ పొలిటీషియన్ కాదు, హైటెక్ పొలిటీషియన్." రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే

'నేను పార్టీలోకి వచ్చిందే అందుకు - ఆ పదవి ఇస్తేనే వాళ్లు కంట్రోల్​లో ఉంటారు'

MLA Rajgopal Reddy on BRS and BJP : భవిష్యత్​లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ( BJP BRS Alliance) పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలు మునిగినట్లేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు గెలవదని జోస్యం చెప్పారు. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో ( Lok Sabha Elections 2024) కాంగ్రెస్ 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఐఎం తమతోనే ఉందని, వారితో కలిస్తే మొత్తం 72 సీట్లు ఉన్నాయని తెలిపారు.

Congress, AIMIM Alliance : రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం ఉంటుదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రస్ ఓటు చీల్చితే వైసీపీకే లాభమన్నారు. వైసీపీకి ప్రభుత్వ లబ్ధిదారుల ఓటు బ్యాంకు బలంగా ఉందని తెలిపారు. భువనగిరి నుంచి బీసీకి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనది అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు హరీశ్ రావు అయితేనే ఆ పార్టీ బతుకుందని అభిప్రాయపడ్డారు.

హరీశ్‌రావు వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి - అధికార పదవులపై సభలో రభస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.