ETV Bharat / state

పడిపోయిన 'మిర్చి' ధరలు - ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 11:05 AM IST

Mirchi Rates Falls Down In Warangal : మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. గత ఏడాది బహిరంగ విపణిలో రికార్డు ధరలను నమోదు చేసిన మిరప, ప్రస్తుతం నేల వైపు చూస్తుంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధర తగ్గడంతో రైతన్నలు దిగులు పడుతున్నారు. జెండా పాట రూ.21 వేలు ప్రకటించినా, వ్యాపారులు మాత్రం రూ.15 వేలలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Chilli Farmers Facing Problems
Mirchi Rates Falls Down In Warangal

Mirchi Rates Falls Down In Warangal : మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తోంది. గతేడాది బహిరంగ విపణిలో రికార్డు ధరలను నమోదు చేసిన మిరప, ప్రస్తుతం నేల చూపు చూస్తోంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధర తగ్గడంతో రైతులు దిగాలు పడుతున్నారు. పెట్టుబడులు కూడా దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mirchi Rates Down In Enumamula Market Yard : ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. ఎటుచూసినా మిరప బస్తాలతో నిండుకుండలా మార్కెట్ యార్డు దర్శనమిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకొస్తున్నారు.

మిరప పంటకు తెగుళ్ల ముప్పు - రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలపై ఎఫెక్ట్

వ్యవసాయ మార్కెట్‌కి పెద్దఎత్తున సరుకు రావడంతో అదునగా భావించిన వ్యాపారులు ధరలను నియంత్రిస్తున్నారు. జెండాపాట పాడినా మార్కెట్ యార్డులో మాత్రం ఆ ధర ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే దక్కుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జెండాపాట 21వేలు ప్రకటించినా వ్యాపారులు మాత్రం 15 వేలలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Mirchi Rates In Warangal Enumamula Market : గతేడాది కనిష్టంగా రూ.30 వేలు గరిష్టంగా రూ.90 వేలకు పైగా మిరప ధర పలకడంతో రైతులు ఈ ఏడాది పెద్ద మొత్తంలో మిర్చి సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి సగానికి పడిపోయిందని రైతులు అంటున్నారు. గతేడాది ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా, ప్రస్తుతం 10 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.

మిర్చి మంటలు - జెండాట కొండంత - వ్యాపారుల ధర గోరంత

నల్లి దోమ వల్ల తీవ్ర నష్టాన్ని మూటకట్టుకున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తెగుళ్ల కారణంగా పురుగు మందుల వాడకం పెరిగి గతంతో పోలిస్తే పెట్టుబడి రెండింతలు పెరిగిందని చెబుతున్నారు. మిరప ఎగుమతి లేని కారణం చూపి వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ అందించి రైతులను ఆదుకోవాలని మిరప రైతులు కోరుతున్నారు.

Chilli Farmers Facing Problems : ఇది ఇలా ఉంటే, మార్కెట్​ యార్డ్​లో హమాలీలు కూలీలు తమ సరుకులను దోచుకుంటున్నారు. అధికారులు మాత్రం దృష్టి సాధించకపోవడం బాధాకరమని రైతులు వాపోతున్నారు. మార్కెట్ యార్డులో మిర్చికి ఆశించిన ధర దక్కకపోవడంతో కూలీలకు డబ్బు ఇచ్చే పరిస్థితి లేదని, అప్పు తీసుకొచ్చి వ్యవసాయం చేసిన తమకు నష్టాలే మిగిలాయని రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. వ్యవసాయాన్ని నమ్ముకోవడం దండగే అని దిగులు పడుతున్నారు. మార్కెట్లో ధరలను నియంత్రిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పడిపోయిన 'మిర్చి' ధరలు - ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల వేడుకోలు

నిండా మునిగిన మిరప రైతులు - తెగుళ్లతో దిగుబడులు తగ్గి దిగాలు

దళారుల పాలవుతున్న రైతు కష్టం - మిర్చి సాగుదార్లను నిండా ముంచుతున్న అడ్డగోలు కొనుగోళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.