ETV Bharat / state

ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి - పట్టించుకోకుండా వెళ్లిన మంత్రి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 10:18 AM IST

Minister Adimulapu Suresh Escort Vehicle Collided Auto One Person Died
Minister Adimulapu Suresh Escort Vehicle Collided Auto One Person Died

Minister Adimulapu Suresh Escort Vehicle Collided Auto One Person Died: జాతీయ రహదారిపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ భక్తుడు మృతి చెందారు.

ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి - పట్టించుకోకుండా వెళ్లిన మంత్రి

Minister Adimulapu Suresh Escort Vehicle Collided Auto One Person Died : జాతీయ రహదారిపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా(Prakasam District) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బుధవారం దోర్నాలలో సీఎం జగన్(CM Jagan) పర్యటన ఉండటంతో ఆదిమూలపు సురేష్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ(Vijayawada) నుంచి మార్కాపురం వస్తున్నారు. ఈ సమయంలో జిల్లాలోని త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి వద్ద మంత్రి ఎస్కార్ట్ వాహనం ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇంట్లో సిలిండర్ బ్లాస్ట్​- ఐదుగురు సజీవ దహనం- మృతుల్లో ముగ్గురు చిన్నారులు

Adimulapu Suresh Escort Collision One killed : ప్రమాద సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) ముందు వెళుతున్న వాహనంలో ఉన్నారు. ప్రమాద విషయం తెలిసినా మంత్రి ఆదిమూలపు సురేష్ పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లిపోవడం కొసమెరుపు. మంత్రి వ్యవహారశైలిపై స్థానికులు విమర్శిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని త్రిపురాంతకం(Tripuranthakam) మండలం రాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్ అనే యువకుడిగా పోలీసులు(police) గుర్తించారు. ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం మూడు ఫల్టీలు కొట్టింది. ట్రాలీ ఆటో(Traly auto) నుజ్జునుజ్జు అయింది.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి

Road Accident in Palnadu District : రోడ్డు ప్రమాదంలో శివ భక్తుడు మృతి : పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ భక్తుడు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, అమరేశ్వరస్వామి దర్శనానికి చిమటా పెద్దిరాజు, కావటి శ్రీను బైక్‌పై బయల్దేరారు. పెదకూరపాడు(Peddakurapadu) సమీపంలో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే పెద్దిరాజు(31) మృతి చెందారు. కావటి శ్రీనుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

Fire Accident in Gunturu: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 19వ వార్డులోని ఎస్టీ కాలనీలో కొమరగిరి నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఆ మంటలు పక్కనే ఉన్న మరో ఏడు పూరి గుడిసెలకు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో బాధితులు సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. వారిని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరామర్శించారు. ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా వైఎస్సార్సీపి పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆగి ఉన్న కారును ఢీకొట్టిన టిప్పర్​ - ముగ్గురు యువకుల మృతి, మరో ముగ్గురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.