ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్‌ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 9:19 AM IST

Medigadda Barrage Issue Updates : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు గుండె వంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు బయటపడుతున్నాయి. విజిలెన్స్‌ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనకట్ట నిర్మాణంలో నాణ్యతపై ఎనలేని నిర్లక్ష్యం వహించినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లను విజిలెన్స్‌ అధికారుల్ని ప్రశ్నించగా నీళ్లు నమిలినట్లు సమాచారం. నాణ్యతపై 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరును ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు

Medigadda Barrage Issue Updates : మేడిగడ్డ ఆనకట్టలో డిజైన్‌ లోపాలతోపాటు క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు నాణ్యత పరీక్షలకు తిలోదకాలిచ్చారా? విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తులో అవుననే సమాధానం లభించినట్లు తెలుస్తోంది. ఇటీవల బ్యారేజీని (Vigilance Inquiry On Medigadda)సందర్శించిన విజిలెన్స్‌ బృందం క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.

Vigilance Inquiry On Medigadda Barrage : బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడేచోటు-గ్లేసియర్స్‌ దెబ్బతిన్నాయి. రెండు పియర్స్‌ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీటు లేచిపోవడం, పియర్స్‌ బాగా పాడ్వడంతో నాణ్యతపై విజిలెన్స్‌ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరును కోరారు.

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Medigadda Barrage Damage : మేడిగడ్డ బ్యారేజీ పునాది పని జరిగే సమయంలో పరిశీలించిన అంశాలు, కోర్‌ తీసి చేసిన పరీక్షల సమాచారం, ఇన్వెస్టిగేషన్‌, సర్వే వివరాలను తేదీలు సహా ఇవ్వాలని విజిలెన్స్ బృందం కోరినట్లు తెలిసింది. ఆనకట్ట నిర్మాణం ఏ తేదీన ప్రారంభమైంది. వచ్చిన మెటీరియల్‌ను పరీక్షించిన వివరాలు, కాంక్రీట్ మిక్స్‌ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లో చేసిన పరీక్షల వివరాలు, ప్రతినెలా బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించిన ఆధారాలివ్వాలని అడిగినట్లు సమాచారం.

Kaleshwaram Project Vigilance Inquiry : క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు పరిశీలించిన తర్వాత రాసిన రిమార్కులు, సరిదిద్దిన అంశాలు, ఉన్నతాధికారులు పరిశీలించినప్పటి వివరాలు కోరినట్లు తెలిసింది. అదేవిధంగా నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇంజినీర్లతో క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వచ్చిన ఫిర్యాదుపై తీసుకొన్న చర్యలు ఇలా పూర్తిస్థాయిలో వివరాలను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

వచ్చినవి వచ్చినట్లుగా ఆమోదించడమే క్వాలిటీ కంట్రోల్‌ పనా అని, విజిలెన్స్‌ అధికారులు క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లను నిలదీసినట్లు తెలిసింది. వచ్చే ఫైళ్లు , బయటకు వెళ్లే ఫైళ్ల నంబర్లను సీజ్‌ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పని జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఇంజినీర్లు నాణ్యతను పరిశీలించి ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్లు, గుత్తేదారులు ఎలా చెబితే అలా చేశారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింతలోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మేడిగడ్డలో బ్యారేజీలో పియర్స్‌ బాగా దెబ్బతిన్నాయి. మొదటగా 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ కుంగిన విషయం తెలిసిందే. దానికి ఇరువైపులా ఉన్న 19, 21 పియర్స్‌ దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. కానీ ఇతర బ్లాకుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. దిగువ భాగాన పరిశీలిస్తే మరిన్ని సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, డైరెక్టర్‌ జనరల్‌ మేడిగడ్డ ఆనకట్టను సందర్శించినపుడు మరిన్ని లోపాలను గుర్తించారు.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

సుమారు 11 పియర్స్‌పై ప్రభావం పడినట్లు విజిలెన్స్ బృందాలు భావిస్తున్నాయి. ఇంకా 22వ పియర్‌ బీటలు వారింది. 11వ పియర్‌ సైతం నిలువుగా చీలినట్లు బీటలున్నాయి. వీటితో పాటు 26వ పియర్‌ గేటుకు దిగువ భాగాన, 19వ పియర్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. బ్యారేజీ గేట్ల వద్ద గ్లేసియర్స్‌ కూడా దెబ్బతిన్నాయి. ఆరో బ్లాక్‌లోని 25-26 పియర్స్‌ గోడ మధ్యలో ఉన్న కాంక్రీట్‌ కొట్టుకుపోయి కుప్పలా పడింది. 29-30వ పియర్స్‌ మధ్య గేటు దిగువ కొంతభాగం కొట్టుకుపోయింది. పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి.

Medigadda Barrage Restoration : రాఫ్ట్‌ కింది భాగంలో ఇసుక జారిపోయినట్లు సమాచారం. ప్రవాహ ఉద్ధృతిని తట్టుకునేందుకు రక్షణగా ఏర్పాటు చేసిన సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆపై సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నీటిని వదిలి 7వ బ్లాక్‌కు రింగ్‌బండ్‌ ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొనే పనిలో ఇంజినీర్లు ఉన్నారు. 19, 20, 21 పియర్స్‌ వద్ద డౌన్‌ స్ట్రీమ్‌లో పనులు చేపట్టారు.

పియర్స్‌ మధ్యభాగంలోని ఇసుకను తీశారు. ఆ ప్రాంతాల్లో నీటినిల్వలు లేకుండా మోటార్లతో తోడుతున్నారు. 11వ పియర్‌ నుంచి 30వ పియర్‌ వరకు ఇసుక అడ్డుగా వేసి పరిశీలిస్తున్నారు. 31వ పియర్‌ నుంచి నదిలో నీటిప్రవాహం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో అన్ని పియర్స్‌ను, క్షుణ్నంగా పరిశీలిస్తే మరిన్ని సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మేడిగడ్డ బ్యారేజీలో మరిన్ని సమస్యలు - విజిలెన్స్ అధ్యయనంలో గుర్తింపు

కాళేశ్వరం, మేడిగడ్డపై రెండో రోజు కొనసాగుతున్న విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.