ETV Bharat / state

జగిత్యాల, సూర్యాపేటలో మార్గదర్శి నూతన శాఖల ప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 5:24 PM IST

Updated : Feb 16, 2024, 10:53 PM IST

Margadarsi New Branches Open in Telangana : మార్గదర్శి చిట్​ఫండ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ శుక్రవారం రెండు నూతన బ్రాంచ్​లను ప్రారంభించింది. ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలో 112వ శాఖను ప్రారంభించగా, సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 113వ శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్​ ప్రత్యక్షంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో చిట్​ ఫండ్​ సంస్థల ప్రతినిధులు, ఖాతాదారులు పాల్గొన్నారు.

Margadarsi
Margadarsi 112th Branch

జగిత్యాల, సూర్యాపేటలో మార్గదర్శి నూతన శాఖల ప్రారంభం

Margadarsi New Branches Open in Telangana : ప్రముఖ చిట్​ఫండ్​ సంస్థ మార్గదర్శి చిట్​ఫండ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​​ సంస్థ(Margadarsi) శుక్రవారం జగిత్యాల, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో రెండు నూతన శాఖలను ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 113వ శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ ప్రత్యక్షంగా​ ప్రారంభించారు. అరవై ఏళ్ల ప్రస్థానంలో మార్గదర్శి నిజాయితీగా లక్షలాది ఖాతాదారులకు సేవలందించిందని ఎండీ శైలజా కిరణ్​ వివరించారు. అవసరం ఏదైనా మార్గదర్శి ఉందనే ధీమా ఖాతాదారుల్లో ఉందన్నారు.

జగిత్యాలలో 112వ బ్రాంచ్​, సూర్యాపేటలో 113వ బ్రాంచ్​ ప్రారంభించామని ఇలా ఒకే రోజు రెండు బ్రాంచ్​లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సంస్థ ఎండీ శైలజా కిరణ్​ తెలిపారు. 1962లో మార్గదర్శి సంస్థ ప్రారంభించింది మొదలు ఈ 61 ఏళ్లలో 113 బ్రాంచ్​లను ప్రారంభించే స్థాయికి ఎదిగిందని చెప్పారు. మార్గదర్శికి ప్రజలకు మధ్య విడదీయలేని బంధం ఉందని, లక్షలాది మంది వినియోగదారులకు మార్గదర్శినే నేస్తమని, ఈ సంస్థపై నమ్మకంతోనే లక్షలాది మంది పెట్టుబడులు పెట్టారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్​ అన్నారు.

"ఒకేరోజు రెండు శాఖలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. 1962లో మార్గదర్శి సంస్థ ప్రారంభించడం జరిగింది. అప్పటి చిరు సంస్థ ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి, ఈ 61 ఏళ్లలో 113 బ్రాంచ్​లను ప్రారంభించే స్థాయికి ఎదిగింది. మార్గదర్శికి ప్రజలకు మధ్య విడదీయలేని బంధం ఉంది. లక్షలాది మంది వినియోగదారులకు మార్గదర్శి నేస్తం. మార్గదర్శిపై నమ్మకంతో లక్షల కుటుంబాలు పెట్టుబడులు పెట్టారు. వారి ఆర్థిక అభివృద్ధికి సిబ్బంది చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. 4 వేల మందికి పైగా సిబ్బందితో ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాం. చిట్​ఫండ్​ ఇండస్ట్రీలో నిజమైన విలువలు, విశ్వసనీయత వలనే ఈ రంగంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదరణ మరువలేనిది." - సీహెచ్. శైలజా కిరణ్​, మార్గదర్శి చిట్​ఫండ్​ సంస్థ ఎండీ

Margadarsi Chit Fund Private Limited Company : అంతకుముందు ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బస్​డిపో ఎదురుగా మార్గదర్శి 112వ శాఖను ఈనాడు సంస్థల ఎండీ సీహెచ్​ కిరణ్​ వర్చువల్​గా హాజరుకాగా, సంస్థ ఉపాధ్యక్షుడు పి. రాజాజీ ప్రారంభించారు. అనంతరం వర్చువల్​గా మాట్లాడిన ఈనాడు ఎండీ కిరణ్​ కొత్త కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఖాతాదారుల సేవలో మార్గదర్శి బ్రాంచి జగిత్యాల శాఖ దినదినాభివృద్ధి సాధించాలని ఈనాడు ఎండీ​ కిరణ్​ ఆకాంక్షించారు. మార్గదర్శిపై ఖాతాదారుల నమ్మకమే సంస్థపై 60 ఏళ్లుగా నిబద్ధత, నిజాయితీకి దోహదపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

"తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల శాఖ 36వ శాఖ కాగా, నాలుగు రాష్ట్రాల్లో బ్రాంచీల సంఖ్య 112కు పెరిగింది. మార్గదర్శి 60 ఏళ్ల ప్రస్థానంలో లక్షలాది మందికి నమ్మకంగా నిలిచింది. అవసరం ఏదైనా మార్గదర్శి ఉందనే ధీమా ఖాతాదారుల్లో ఉండటం సంస్థ ఎదుగుదలకు ప్రధాన కారణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖాతాదారులకు చేరువ అవుతూ వారి అవసరాలకు తగ్గట్లుగా అందరికీ అందుబాటులో ఉంటున్నాం"- సీహెచ్. కిరణ్, ఈనాడు ఎండీ

Margadarsi 110th Branch Opening in Karnataka : కర్ణాటకలోని హవేరీలో మార్గదర్శి 110వ బ్రాంచ్‌ ప్రారంభం

విశ్వసనీయతకు మారుపేరుగా మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ - హైదరాబాద్​లో 111వ శాఖను ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్‌

మార్గదర్శిపై కేసుల విచారణ నిలిపివేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

Last Updated :Feb 16, 2024, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.