ETV Bharat / state

కాంగ్రెస్‌ నేతలు, మీడియా సంస్థలకు కేటీఆర్‌ లీగల్ నోటీసులు - KTR sent legal notices

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 3:53 PM IST

Updated : Apr 3, 2024, 6:11 PM IST

KTR sent legal notices : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు, టీవీ ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

KTR LEGAL NOTICES TO CONGRESS
KTR sent legal notices

KTR Sent Legal Notices : ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో(Phone Tapping) తనపై అవాస్తవాలు ఆరోపిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR), పలువురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. వీరిలో దేవాదాయశాఖా మంత్రి మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు.

దానం విషయంలో ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి - లేదంటే హైకోర్టుకే : కేటీఆర్ - KTR ON DANAM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ, అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసినందుకు నోటీసులు పంపిన ఆయన, వారం రోజుల్లోపు క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా, పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ముగ్గురు నేతలు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. మరికొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా కేటీఆర్ మరోమారు నోటీసులు పంపించారు. సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తమకు ఉన్న రక్షణలను ఉపయోగించుకొని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లోగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

KTR Comments On Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్వవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. లీకు వీరుడు సీఎం రేవంత్ లీకులు ఇస్తున్నారని ఆక్షేపించారు. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ తనకు ఎందుకన్న కేటీఆర్, ఆరోపణలు చేసిన మంత్రికి బుర్ర పనిచేస్తుందా అని ప్రశ్నించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని, అప్పటి తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్​పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఫోన్ నిఘాలో ఉందని ఆపిల్ సంస్థ 2022 లో మెసేజ్ కూడా పంపిందని గుర్తు చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌పై కాదు - వాటర్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టాలి : కేటీఆర్‌ - KTR on Water Shortage in Hyderabad

" ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఎవరూ కూల్చాల్సిన పని లేదు- ఆ జిల్లా నాయకులే చాలు" - LOK SABHA ELECTIONS 2024

Last Updated :Apr 3, 2024, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.