ETV Bharat / state

బీఆర్ఎస్​ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదు : కడియం శ్రీహరి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 4:20 PM IST

Updated : Jan 21, 2024, 4:30 PM IST

BRS Leaders Comments on CM Revanth
Kadiyam Srihari Fires on CM Revanth Reddy

Kadiyam Srihari Fires on CM Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్​లో చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ తెలంగాణ పరువు తీశారని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆక్షేపించారు. బీఆర్ఎస్​ను బొంద పెట్టే మొనగాడు ఇంకా పుట్టలేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో లోక్​సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్​దే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

Kadiyam Srihari Fires on CM Revanth Reddy : దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆక్షేపించారు. మల్కాజ్​గిరి లోక్​సభ(Parliament Election) సన్నాహక సమావేశంలో మాట్లాడిన కడియం, రేవంత్ రెడ్డి వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్​ను వంద మీటర్ల లోతున బొంద పెడతామని సీఎం రేవంత్ రెడ్డి లండన్​లో అన్నారని, గులాబీ పార్టీని బొంద పెట్టే మొనగాడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.

'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్​తో దూసుకొస్తుంది : కేటీఆర్

బీఆర్ఎస్​ను బొంద పెట్టడం రేవంత్​తో కాదు కదా, వాళ్ల నాన్న వల్ల కూడా కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గుంపు మేస్త్రీ పేరుకు తగ్గట్టుగానే రేవంత్ వ్యవహార సరళి ఉందని కడియం అన్నారు. కేటీఆర్(KTR) దావోస్ వెళ్లినప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారో, రేవంత్ ఎంత హీనంగా వ్యవహరించారో ప్రజలు గమనించారని తెలిపారు.

BRS Leaders Comments on CM Revanth : రేవంత్ గుంపు మేస్త్రీ గొప్పతనం ఏంటో తేలిపోయిందన్న ఆయన, ఐటీ రంగంలో తెలంగాణను కేటీఆర్ ప్రపంచంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణ పరువు తీశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని, పోటీపడి గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని శ్రీహరి ఆక్షేపించారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ బీఆర్ఎస్​దే విజయమని అన్నారు.

అదానీతో రేవంత్‌ రెడ్డి దిల్లీలో కుస్తీ, దావోస్‌లో దోస్తీ : దాసోజ్‌ శ్రవణ్‌

వచ్చిన అవకాశాన్ని సీఎం రేవంత్ వినియోగించుకుని ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలి కానీ, ఇలా విదేశీ పర్యటనలో అసంబద్ధంగా దిగజారి మాట్లాడటం సరికాదని గులాబీ నేతలు హితవు పలికారు. విదేశాలకు(Foreign Trip) వెళ్లి పెట్టుబడులు తీసుకురావాలి కానీ అంత అహంకారం పనికిరాదని, సీఎం పాండిత్యాన్ని రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.

Mallareddy on Parliament Elections 2024 : గెలవగానే కాంగ్రెస్‌ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంద మీటర్ల లోతులో బీఆర్ఎస్​ పార్టీ కాదు, కాంగ్రెస్ వెయ్యి మీటర్ల లోతున ఉందని పరిశీలించుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ హామీని అమలు చేయలేదని విమర్శించారు.

మాయమాటలతో రేవంత్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మల్లారెడ్డి విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మోదీ(PM Modi) ఎన్నో ప్రభుత్వాలను కూలగొట్టారని, పార్లమెంటు ఎలక్షన్స్​ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని మల్లారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మల్కాజ్​గిరి టికెట్​ అధిష్ఠానం ఎవరికి ఇస్తే వారిని గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు - ప్రాధాన్యం లేకుండా ఎన్నాళ్లు పనిచేయాలంటూ అసహనం

బీఆర్​ఎస్​ను 100 మీటర్ల లోతులో పాతిపెడతానన్న సీఎం రేవంత్​ రెడ్డి - వెకిలి మాటలెందుకంటూ మాజీ మంత్రి ఆగ్రహం

Last Updated :Jan 21, 2024, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.