ETV Bharat / state

అప్పుడేమో నిరుద్యోగుల కల్పతరువు - ఇప్పుడు ఫీజు వసూలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 8:33 AM IST

Updated : Jan 24, 2024, 8:40 AM IST

International Driving School In Rajanna Sircilla
International Driving School

International Driving School In Rajanna Sircilla : అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్ నిరుద్యోగుల పట్ల కల్పతరువుగా మారింది. గతంలో పలు కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఔత్సాహికులకు భోజనం వసతి ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధిని కూడా కల్పించేందుకు దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకొని శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ఆధునిక సదుపాయాలు గల ఏకైక డ్రైవింగ్‌ స్కూల్‌గా పేరున్నప్పటికి ఫీజులు చెల్లించాలనే సరికి అనుకున్నంత మేర శిక్షణ పొందడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

అప్పుడేమో నిరుద్యోగుల పట్ల కల్పతరువుగా సిరిసిల్ల డ్రైవింగ్‌ స్కూల్‌ - ఇప్పుడు పీజు వసూలు

International Driving School In Rajanna Sircilla : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక భారం కారణంగా అనుకున్న మేరకు ఔత్సాహికులు ప్రవేశం పొందడం లేదు. రాష్ట్రంలోనే తొలి డ్రైవింగ్‌ స్కూల్‌ను సిరిసిల్లలో అప్పటి మంత్రి కేటీఆర్‌ చొరవతో 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 16 కోట్ల రూపాయలు, అశోక్‌ లేలాండ్‌తో కలిసి సంయుక్తంగా ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశాయి. జిల్లాలో తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లిలో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రంను అప్పటి సీఎం కేసీఆర్‌(EX CM KCR) ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 20 ఎకరాల స్థలం కేటాయించింది.

Sircilla Driving School : దీనిలో 5 ఎకరాల్లో పరిపాలన వసతి గృహ భవనాలు 15 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్‌ స్కూల్‌ ట్రాక్‌లను నిర్మించారు. ప్రపంచంలో వివిధ దేశాల్లో వాహనాలు నడపడంలో మెళుకువలు తెలుసుకునేందుకు డిజిటల్‌ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్‌ స్కూల్‌లో మూడున్నర కిలోమీటర్ల మేర విశాలమైన ట్రాక్‌ నిర్మించారు. ఇక్కడ 180 మందికి వసతి సౌకర్యం, మరో 200ల మందికి డేస్‌ స్కాలర్‌ చొప్పున లైట్‌ మోటారు వెహికల్‌, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. తొలి ఏడాది బడా కంపెనీలు సామాజిక బాధ్యత నిధులు కేటాయించడంతో ఉచితంగా శిక్షణ లభించింది.

Driving School for Women : మహిళల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌

EX CM KCR inaugurated Telangana Institute of Driving Education and Skills in Sircilla : దాదాపు ఏడాది కాలంగా ఈ నిధులు నిలిచి పోవడంతో ఆ సదుపాయాన్ని నిలిపివేశారు. ఏటా సగటున నాలుగు వేల మంది శిక్షణ పొందే అవకాశం ఉంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అందించే ధ్రువీకరణ పత్రంతో రాష్ట్రంలో ఏ రవాణాశాఖ కార్యాలయం నుంచైనా లైసెన్స్‌ పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ డ్రైవింగ్ పాఠశాలలో శిక్షణ పొందితే మంచి అవకాశాలు లభిస్తాయని అధికారులు, శిక్షకులు చెబుతున్నారు.

"శిక్షణ కాలంలో డ్రైవింగ్​లోని​ అన్ని అంశాల మీద అవగాహన కల్పించడం, తద్వారా స్కిల్స్​తో కూడుకున్న డ్రైవర్​లను తయారు చేయడం కోసం ఈ స్కూల్​ను స్థాపించాం. దీని ద్వారా జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి."-కొండల్ రావు, జిల్లా రవాణాధికారి

సిరిసిల్ల డ్రైవింగ్‍ శిక్షణాకేంద్రం-ఉపాధికి ఊతం : కేవలం దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందేందుకు ఇక్కడ మెళకువలు నేర్పిస్తామని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పదోతరగతి ఆపై చదువుకున్న వారికి ఇక్కడ శిక్షణ పొందే ఆస్కారముందని అంటున్నారు. తొలుత సిమ్యులేటర్​పై శిక్షణతో పాటు ఆ తర్వాత అంతర్జాతీయంగా రోడ్డు నిబంధనలు వివరించే విధంగా శిక్షణ పొందే అవకాశం ఐటీడీఆర్‌ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్తున్న శిక్షణ తమకు సంతృప్తి ఇస్తుందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం నిబంధనలు మారిన దృష్ట్యా ఉచితంగా శిక్షణ పొందే అవకాశం లేదని ప్రభుత్వం నిధులు వెచ్చిస్తే మాత్రం ఆ సదుపాయం కూడా అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి కొప్పుల

Rajanna Sircilla Driving School : అతిపెద్ద డ్రైవింగ్ స్కూల్.. కానీ నిధులు మాత్రం నిల్

Last Updated :Jan 24, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.