ETV Bharat / state

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే - లారీలు వదిలేసి పరారైన దుండగులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 12:24 PM IST

Illegal Sand Mining Stopped by TDP Bode Prasad: మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలను మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకున్నారు. అక్రమ మైనింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలంటూ రాత్రి నుంచి ఇసుక ర్యాంపులోనే బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బోడెప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Illegal_Sand_Mining_Stopped_by_TDP_Bode_Prasad
Illegal_Sand_Mining_Stopped_by_TDP_Bode_Prasad

Illegal Sand Mining Stopped by TDP Bode Prasad: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగే ఇసుక అక్రమ తవ్వకాలను మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుకున్నారు. ఇసుక లారీలను అడ్డగించి క్వారీలోనే బైఠాయించారు. మంత్రి జోగి రమేష్​ను వైసీపీ పెనమలూరు ఇన్​ఛార్జ్​గా నియమించగానే అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని బోడె ప్రసాద్‌ ఆరోపించారు.

క్వారీలో వ్యక్తులను ప్రశ్నిస్తే మంత్రి వాహనాలు అని తేలిందని అన్నారు. పెడనలో మంత్రిగా ఉండి పెనమలూరు నియోజకవర్గానికి ఇన్​ఛార్జి వచ్చి, అడ్డగోలుగా దోచుకుంటున్నాడంటే, రేపు నియోజకవర్గాన్ని అమ్మకానికి పెడతారని బోడె ప్రసాద్ మండిపడ్డారు. చోడవరం, మద్దూరు గ్రామాలలో గత నాలుగు రోజుల నుంచి అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు.

అనుమతులు లేకుండా ఇసుక మాఫియా పొక్లెయిన్లు పెట్టి ఇసుక తరలిస్తున్నారన్నారని అన్నారు. అర్ధరాత్రి చోడవరం ఇసుక ర్యాంపు వద్దకు బోడె ప్రసాద్, తెలుగుదేశం శ్రేణులు వెళ్లారు. తెలుగుదేశం శ్రేణుల్ని చూసి పొక్లెయిన్లు, లారీలు వదిలేసి ఇసుక మాఫియా పరారయ్యారు. ఈమేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు బోడె ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. అక్రమ మైనింగ్ ఎవరు చేస్తున్నారో తేల్చాలంటూ ఇసుక రాంపులోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారని బోడెప్రసాద్‌ మండిపడ్డారు.

జోగి రమేష్​ని పెనమలూరు ఇన్​ఛార్జ్​గా పెట్టి పది రోజులు కూడా అవ్వలేదని, అప్పుడే ఇష్టానుసారం అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేలాది లారీల్లో మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. తాను క్వారీలోకి రాగానే లారీ డ్రైవర్లు, ప్లొక్లెయిన ఆపరేటర్లు పారిపోయారని తెలిపారు. ఇక్కడ ఏ తప్పూ చేయకపోతే వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. జోగి రమేష్ గుమస్తా ఫిరోజ్ అనే వ్యక్తి అక్రమంగా మైనింగ్ జరుపుతున్నారని అన్నారు. నాలుగైదు రోజుల్లోనే పెనమలూరులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యథేచ్చగా కొనసాగుతున్న ఇసుక దందా- తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ, జనసేన నేతలు

అక్రమంగా మట్టి తరలింపు వాహనాలు అడ్డగింత: అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు చెరువు నుంచి గత కొంతకాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మట్టిని భారీ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దీని కారణంగా అంతరగంగ నుంచి కూడేరుకు వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా పాడయ్యింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మట్టి లోడ్​తో వెళుతున్న టిప్పర్లను అడ్డుకున్నారు.

గ్రామస్తులు అడ్డుకోవడంతో చాలా సేపు వాహనాలు అక్కడే అగిపోయాయి. దీనిని తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు ఆ గ్రామంలో తమ పార్టీ నాయకులకు ఫోన్ చేశారు. గ్రామస్తులు మీద ఒత్తిడి తెచ్చి వాహనాలను వదిలేలా చేశారు. ఆ నాయకుడి కనుసన్నల్లోనే మట్టి తరలింపు సాగుతోందని స్థానికులు ఆరేపిస్తున్నారు.

టన్నుల కొద్దీ తవ్వుకో- తరలించుకో- దోచుకో- ఏపీలో వైసీపీ గజదొంగల ఇసుక దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.