ETV Bharat / state

టన్నుల కొద్దీ తవ్వుకో- తరలించుకో- దోచుకో- ఏపీలో వైసీపీ గజదొంగల ఇసుక దందా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 9:34 AM IST

YSRCP Leaders Illegal Sand Mining: అనుమతులుండవ్‌ కానీ, తోడేసుకుంటారు! వరుసకట్టి లారీలకు లారీల ఇసుకను తరలించుకెళ్తారు! అడ్డుకునేవారుండరు. రోజూ వందల కోట్ల వ్యాపారం! ఏదీ రికార్డుల్లో ఉండదు! ప్రభుత్వానికి పైసా ఆదాయం రాదు! ఇదంతా ప్రభుత్వ పెద్దల చేత, ప్రభుత్వ పెద్దల కోసం ప్రభుత్వ పెద్దలే సాగిస్తున్న ఇసుక దోపిడీ! రాష్ట్రంలో అధికార పార్టీ గజదొంగలు ఇసుక రేవుల్ని గుల్ల చేస్తున్నారు.దోపిడీ లెక్క ప్రభుత్వ పెద్దలకు ముట్టజెప్తున్నారు.

YSRCP_Leaders_Illegal_Sand_Mining
YSRCP_Leaders_Illegal_Sand_Mining

YSRCP Leaders Illegal Sand Mining : టన్నుల కొద్దీ తవ్వుకో లారీల కొద్దీ తరలించుకో దర్జాగా దోచుకో ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదూ! ఇది ఎక్కడో విన్న మాట కాదు సీఎం జగన్‌ అనే మాట! ఔను రాష్ట్రంలోని ఏ ఇసుక రేవులో చూసినా ఇలా లారీలు బారులు తీరుతున్నాయి. ప్రొక్లైన్లు మోతమోగిస్తున్నాయి! ఇందులో తప్పేముంది అని అనుమానపడకండి? రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓపెన్‌ రీచ్‌లో కూడా ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతి లేదు! కేంద్ర పర్యావరణ సంస్థైన రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ-సియా గతేడాది ఏప్రిల్‌లో 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఆదేశాలిచ్చింది. ఐనా ఇసుక తవ్వకాలు ఎక్కడా ఆగలేదు. ఎవరూ ఆపలేదు.

Illegal Sand Mining in AP : తాజాగా గత నెలలో రెండు కొత్త గుత్తేదారు సంస్థల పేరిట కొత్త ముఠా ఇసుక వ్యాపారం ఆరంభించింది. వీరికి కూడా పర్యావరణ అనుమతుల్లేవ్. రాష్ట్ర వ్యాప్తంగా 172 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఇవ్వాలంటూ గనులశాఖ గత నెలలో సియాకు దరఖాస్తు చేసింది. కానీ అనుమతులివ్వలేదు. సియా అసలు నిర్ణయమే తీసుకోలేదు. కానీ టిప్పర్లకు టిప్పర్లు దర్జాగా తవ్వేసుకుంటున్నారు. టన్ను ఇసుకకు ప్రభుత్వానికి సీనరేజి కింద 375 రూపాయలు, జీఎస్టీ కింద మరో 24 రూపాయలు చెల్లించాలి. అనధికారిక తవ్వకాలేవీ గనులశాఖ లెక్కల్లోకి రాదు. మరి లారీలకొద్దీ అమ్ముకుంటున్న ఇసుక డబ్బు ఎటెళ్తోంది? ఎవరికి చేరుతోంది? అన్నది బహిరంగ రహస్యమే. నిత్యం సగటున 60 నుంచి 70 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారు. దీని ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను వచ్చే ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారం ఉంది.

కృష్ణా నదిలో తవ్వకో - తరలించుకో - తీనుకో - ఇదీ వైఎస్సార్సీపీ నేతల దోపిడీ తీరు

తెరవెనుక సీఎం సోదరుడు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదుల్లో సాగుతున్న ఇసుక దందా అధికారిక ముద్రతోనే సాగుతోంది. 2021 మే నుంచి గత నెల వరకు జేపీ పవర్‌ వెంచర్స్‌ ముసుగులో వైఎస్సార్సీపీ నేతలే ఇసుక తరలించుకుపోయారు! గతనెల నుంచి తెలంగాణకు చెందిన ప్రతిమా ఇన్‌ఫ్రా, రాజస్థాన్‌కు చెందిన GCKCఅనే సంస్థలకు టెండర్లు దక్కినట్లు చూపించారు. కానీ ఆ రెండు కంపెనీల తెరవెనుకుండి ఇసుక వ్యాపారం చేస్తోంది సీఎం జగన్‌కు సోదరుడైన వైఎస్‌ అనిల్‌రెడ్డి! ఆయన కనుసన్నల్లో సాగుతున్న ఈ దందాను ఆయన ఏపీ ఒకరు ప్రత్యక్షంగా నడిపిస్తుంటారు.

సీఎంఓకి చెందినోళ్లం : రాష్ట్ర మంతా ఇసుక వ్యాపారాన్ని నిత్యం సీఎం క్యాంపు కార్యాలయంలో తిష్టవేసిఉండే అంజిరెడ్డి అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు కోఆర్డినేటర్‌గా కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులున్నాయా? అని ఎవరైనా ప్రశ్నిస్తే తాము సీఎంఓకి చెందినోళ్లమంటూ బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇసుక టెండర్లు 3ప్యాకేజీలు కావడంతో మూడింటికి ముగ్గురు రీజనల్‌ పర్యవేక్షకుల్ని, జిల్లాకు ఓ మేనేజర్‌ను నియమించి వారి ద్వారా ఇసుక వ్యాపారం జరిపిస్తున్నారు. విజయవాడలోని గుణదలలో కార్యాలయం ఉండి, వివిధ సర్వేలు చేసే, జగన్‌ మనసు చూరగొన్న ఓ ప్రముఖుడు ఇసుక దందాలో ఇటీవల భాగస్వామిగా చేరినట్లు తెలిసింది. గతంలో రీచ్‌ల్లో పనిచేసిన వారిని కొత్త ముఠా పూర్తిగా తొలగించింది. వీరిస్థానంలో కొత్తవారిని నియమించారు.

రోజూ 300లారీలు ₹30లక్షల దందా - అధికార పార్టీ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

చూస్తామంతే చర్యలు తీసుకోం : ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీకి గనులశాఖ కూడా సహకరిస్తోంది. ఇసుక రీచ్‌ పరిధి 5 హెక్టార్లకుకు మించితే దానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. దీనివల్ల స్థానికంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో గనులశాఖ అతితెలివి ప్రదర్శిస్తోంది. కేవలం 4.9, 4.8 హెక్టార్లు చొప్పున చిన్నచిన్న రీచ్‌లుగా విభజించి పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. పైగా లారీలకొద్దీ ఇసుక దోచుకుపోతుంటే గనులశాఖ కళ్లప్పగించి చూస్తోంది.

ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేస్తే అంతే : ఇసుక వ్యవహారం జోలికి వెళ్లొద్దని, దీనివెనుక పెద్దలు ఉన్నారంటూ అన్నిశాఖల ఉన్నతాధికారుల నుంచి అక్కడి జిల్లా, మండలస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులెవరైనా ధైర్యం చేసి ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేసినా, లారీలను అడ్డుకుంటే వెనక్కి వచ్చాయాలంటూ వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తాయనే విమర్శలున్నాయి.

వైసీపీ నేతల ఖనిజ దోపిడీకి రాజమార్గం- వారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం

టన్నుల కొద్దీ తవ్వుకో - భారీగా లారీల్లో తరలించుకో - దర్జాగా దోచుకో - వైసీపీ నేతల దందా తీరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.