ETV Bharat / state

జీఎస్టీ రీఫండ్‌ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు - బోగస్‌ బిల్లులతో రూ.40 కోట్లు కాజేశారు - GST Refund Scam Update

author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 4:14 PM IST

GST Refund Scam In Telangana : జీఎస్టీ రీఫండ్‌ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ముకే కన్నం వేసిన అక్రమార్కుల భరతం పట్టే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ శాఖకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు రూ. 40 కోట్ల రూపాయల రీఫండ్‌లకు చెందిన అరెస్టులు జరిగినప్పటికీ మరికొన్ని రీఫండ్‌లపై శాఖాపరంగా, పోలీసులు ఆరా తీస్తుండడం వాణిజ్యపన్నుల శాఖను కుదిపేస్తోంది.

GST Refund Scam In Hyderabad
GST Refund Fraud Update (ETV Bharat)

జీఎస్టీ రీఫండ్‌ కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు - బోగస్‌ బిల్లులతో రూ.40 కోట్లు కాజేశారు (ETV Bharat)

GST Refund Fraud Update : గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రికల్‌ వాహనాల విక్రయాల నిమిత్తం పలు షోరూమ్‌ల నిర్వహణ కోసం వాణిజ్య పన్నులశాఖ డీలర్లకు జీఎస్టీ లైసెన్స్‌లు ఇచ్చింది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు చేయకుండానే చేసినట్లు బోగస్‌ ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీ వెబ్ పోర్టల్‌లో అధికారులు అప్‌లోడ్ చేశారు. తద్వారా రీఫండ్ తీసుకుని ప్రభుత్వ సొమ్మును అధికారులతో కుమ్మక్కై కొందరు అక్రమార్కులు నొక్కేశారు. 2022 జులై నుంచి 2023 నవంబరు వరకు జరిగిన రీఫండ్‌ల కుంభకోణాన్ని ఈ ఏడాది మార్చి 18న "ఈటీవీ'' పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది.

జీఎస్టీ బోగస్‌ బిల్లులు : జీఎస్టీ చట్టంలోని వెసులుబాటును ఆసరా చేసుకుని అంతర్రాష్ట్ర ట్యాక్స్‌ కన్సల్టెంట్ సహకారంతో ఈ అక్రమార్కులు అవినీతికి బీజం వేసినట్లుగా మేరట్‌ డీజీజీఐ అప్రమత్తం చేసింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి పర్యవేక్షణలో అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కుల నుంచి అందినకాడికి కమిషన్లు దండుకుని డిప్యూటీ కమిషనర్‌ నుంచి కిందస్థాయి డీసీటీవో వరకు పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా మేరకు నలుగురు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల సహకారంతో వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపెట్టరారు.

జీఎస్టీల చెల్లింపులపై భగ్గుమంటున్న రెండు శాఖలు - రూ.54 కోట్ల పన్ను చెల్లించాలని ఎక్సైజ్‌ శాఖ​కు నోటీసులు - notice on gst to excise department

GST Refund Scam In Hyderabad : జీఎస్టీ రీఫండ్‌లు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలోనూ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే దాదాపు రూ.40 కోట్ల రూపాయలు రీఫండ్‌లు ఇచ్చిన కేసుల్లో విచారణ చేస్తున్న సీసీఎస్‌ పోలీసులు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఒక ఉపకమిషనర్‌, ఇద్దరు సహాయ కమిషనర్లు, ఒక డీసీటీవో, మరొక సీనియర్‌ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేసేందుకు రాయితీలు కల్పించింది.

ఎలక్ట్రిక్‌ వాహనాల విలువపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ వేస్తుంది. కానీ ద్విచక్రవాహనాల విడిభాగాల కొనుగోలుపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. దీంతో ఎలక్ట్రిక్‌ బైకుల విక్రయాలపై వచ్చిన 5శాతం జీఎస్టీని మినహాయించి మరో 13శాతం జీఎస్టీ రీఫండ్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా మంది అధికారులు రీఫండ్ దరఖాస్తులను పరిశీలన చేయకుండానే ఇచ్చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరికొందరు అధికారులు బోగస్‌ ఇన్‌వాయిస్‌లని తెలిసి రీఫండ్‌లు ఇచ్చినట్లు సమాచారం.

ఏదేమైనా ఇప్పటి వరకు రూ.40 కోట్ల రూపాయలు రీఫండ్‌లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. బోగస్‌ సంస్థలకు రిజిస్ట్రేషన్‌ ఇచ్చిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని పోలీసు శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు కాకుండా మరికొందరు కూడా ఈ రీఫండ్‌లు ఇచ్చిన అధికారులు ఉండడంతో వారిని కూడా పిలిపించి విచారణ చేయాలని సీసీఎస్‌ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో వాణిజ్య పన్నులు Vs​ ఆబ్కారీ శాఖ - హాలోగ్రామ్​ల అమ్మకాల విషయంలో ముదిరిన వివాదం - EXCISE VS COMMERCIAL TAX DEPT IN TS

జీఎస్టీ రీఫండ్‌ల ముసుగులో ప్రభుత్వ ఖజానాకు గండి - మరో ఐదుగురు అధికారుల అరెస్టు - GST Fraud in Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.