ETV Bharat / state

4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 4:26 PM IST

Gaddam Ranjith Got Government Jobs Story : ఎంతో మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటారు. పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు కోచింగ్‌ కేంద్రాల్లో ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. అందరిలాగే ఆ యువకుడూ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నాడు. కానీ చాలామందిలా ఎలాంటి కోచింగ్‌ సెంటర్‌కూ వెళ్లలేదు. సొంతంగానే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇప్పడు ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 4 ప్రభుత్వ కొలువులను ఒకదాని తర్వాత ఒకటి సాధించాడు. నిరుపేద నేపథ్యమున్నా పట్టుదలతో పోటీని తట్టుకుని నిలబడిన ఆ యువ ప్రతిభావంతుడు ఎవరో తెలియాలంటే? ఈ కథనం చూడాల్సిందే.

Gaddam Ranjith
Gaddam Ranjith Got Government Jobs Story

లేమి సౌకర్యాలతో కొట్టుమిట్టాడి 4 ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

Gaddam Ranjith Got Government Jobs Story : కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలమని విశ్వసిస్తుంటారు ఉద్యోగార్థులు. కానీ ఈ యువకుడు మాత్రం స్వీయప్రతిభనే నమ్ముకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సొంతంగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడినా ఎన్నో వ్యయ ప్రయాసలు పడి వరసగా 4 ఉద్యోగాలను ఒడిసిపట్టాడు. దృఢనిశ్చయానికి నిరంతర శ్రమ తోడైతే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాడు.

ఈ యువకుడి పేరు గడ్డం రంజిత్‌. స్వస్థలం వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామం. ఇతనిది నిరుపేద వ్యవసాయ కుటుంబం కావడంతో ఎన్నో ఇక్కట్ల మధ్యే చదువు కొనసాగించాడు. తల్లిదండ్రుల మద్దతుతో హైదరాబాద్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేశాడు. తర్వాత ప్రభుత్వ కొలువు దక్కించుకోవాలనే తపనతో మిత్రులతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.

చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి

స్నేహితులతో కలసి నిరంతర అభ్యాసం చేస్తూ సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకున్నాడు రంజిత్‌. ఆన్‌లైన్‌లోనూ సమాచారం సేకరించుకుని సొంతంగా నోట్స్‌ తయారుచేసుకునేవాడు. తరచూ కోచింగ్ సెంటర్లలో నిర్వహించే ప్రతిభా పరీక్షలకు హాజరయ్యేవాడు. అలా తన సామర్థ్యాన్ని విశ్లేషించుకునేవాడు. ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్, అనంతరం ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు దక్కించుకున్నాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారిగా నాలుగో ప్రభుత్వ ఉద్యోగం దక్కడం... ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతున్నాడు.

"చిన్నప్పటి నుంచి నేను ఆవరేజ్​ స్టూడెంట్​ ఏ. బీటెక్​ పూర్తి చేశాక ప్రైవేట్ ఉద్యోగం చేశాను. ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉండి ప్రిపేర్​ అవ్వాలి అనుకున్నాను. నలుగురం స్నేహితులం కలిసి పరీక్ష లకు సిద్ధం అయ్యాను. రైల్వే నోటిఫికేషన్​ వచ్చినప్పుడు గ్రేడ్​ బీ ఉద్యోగం వచ్చింది. పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​ పైన ఆస్తకి ఉండడంతో గ్రూప్​ 2కు ప్రిపేర్​ అయ్యాను. ఈ క్రమంలో నాకు ఎక్సైజ్​ కానిస్టేబుల్​, గ్రూప్​-4 రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు టౌన్​ ప్లానింగ్​ అధికారిగా ఉద్యోగం వచ్చింది. మొదటగా సబ్జెక్ట్​ను మనం పూర్తిగా చదవాలి. రివిజన్ చేయాలి. తర్వాత పరీక్ష మనమే మంచిగా రాస్తాము." - గడ్డం రంజిత్‌

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

ప్రస్తుతం రైల్వేశాఖలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు రంజిత్‌. ఎక్సైజ్‌ శాఖ కానిస్టేబుల్‌గా వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో టౌన్ ప్లానింగ్ అధికారి ఫలితాలు వెలువడ్డాయని దీంతో ఇప్పుడు టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగానే వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు చెబుతున్నాడు. కృతనిశ్చయంతో అపజయాలకు కుంగిపోకుండా సాధన కొనసాగిస్తే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోగలరని అంటున్నాడు రంజిత్‌. స్వతహాగా తానేమీ మెరిట్‌ విద్యార్థి కాకపోయినా పట్టుదలతో కృషి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెబుతున్నాడు. తాను కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లకున్నా ఎలా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడో వివరిస్తున్నాడు.

తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించా : ఐపీఎస్ మౌనిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.