ETV Bharat / state

చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 3:27 PM IST

Special Story Bhanu Prakash From Nalgonda : ఆ యువకుడిది నిరుపేద చేనేత కుటుంబం. అందుకే చిన్నతనంలోనే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. చదువుతో పాటు ఆటలపై ఆసక్తి పెంచుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. ఎన్​సీసీలో చేరి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకున్నాడు. డీజీ కమాండెంట్ సిల్వర్ మెడల్ అందుకున్న ఈ ఎన్​సీసీ కుర్రాడి కథేంటో తెలుసుకోండి.

Story on Bhanu Prakash From Nalgonda
Special Story Bhanu Prakash From Nalgonda

Special Story Bhanu Prakash From Nalgonda చేనేత కుటుంబ నుంచి ఎన్​సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం

Special Story Bhanu Prakash From Nalgonda : సాధారణంగా అంతా ఏదోఒక విభాగంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. కానీ ఈ యువకుడి ప్రత్యేకతే వేరు. ఆటలపై ఉన్న ఆసక్తితో బాల్యం నుంచే వివిధ క్రీడల్లో రాణించాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. చదువు, ఆటలతో పాటు, ఎన్​సీసీలోనూ తనదైన ముద్రవేశాడీ కుర్రాడు.

ఈ యువకుడి పేరు భాను ప్రకాశ్‌. నల్లగొండ జిల్లా ఆలేరులో ఒక చేనేత కుటుంబంలో జన్మించాడు. పాఠశాల స్థాయి నుంచే ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు. పీఐటీల ప్రోత్సాహంతో క్రికెట్, కబడ్డీ, టార్గెట్ బాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడల్లో రాణించాడు.

గగనతలంలో గస్తీ కాసేందుకు సిద్ధమైన క్యాడెట్స్ ​- శిక్షణ పూర్తి చేసుకున్న 213 మంది

పాల్గొన్న ప్రతి టోర్నీలో ప్రతిభ కనబరిచాడు ప్రకాశ్‌. కోకో, కబడ్డీ స్టేట్ రెఫరీగా టార్గెట్ బాల్ జాతీయ రెఫరీగా అర్హత సాధించాడు. 2021-22లో యాదాద్రి భువనగిరి జిల్లా జూనియర్ కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహిరించి పలువురి ప్రశంసలందుకున్నాడు.

2019లో జరిగిన జాతీయ టార్గెట్‌బాల్ పోటీల్లో కాంస్యంతో పాటు ఉత్తమ ఆటగాడిగా ఎంపిక అయ్యాడు భాను. 2022లో ఆలిండియా కానోయింగ్, కయాకింగ్ జాతీయ టోర్నమెంటులో సత్తా చాటాడు. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీల్లో రజత పతకంతో మెరిశాడు.

విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిండమే లక్ష్యం - అందుకే 'స్టూడెంట్ ట్రైబ్‌' రూపకల్పన

ఆటల్లో రాణిస్తూనే ఎన్​సీసీ పై దృష్టి సారించాడు ప్రకాశ్‌. అఖిల భారత స్ధాయి యువ అసోసియేట్ ఎన్​సీపీ అధికారిగా ఎంపికై, 45 రోజుల శిక్షణ పొందాడు. సాముహిక పరేడ్‌లో ప్రథమ స్థానంలో నిలివడమే గాక, నేవీ విభాగంలో లెఫ్టినెంట్ జనరల్ చేతుల మీదుగా డీజీ కమాండెంట్ సిల్వర్ మెడల్ అందుకున్నాడు.

"స్కూలింగ్, ఇంటర్ ఇంటికి దగ్గర్లోనే చేశాను. డిప్లోమోలో మంచి టీచర్స్ ఉన్నారు వారు చేసిన సహాయం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఫిజికల్ ఎడ్యూకేషన్​లో మనం ఎలా ముందుకు రావాలి వారి గైడ్​లైన్స్​లో ముందుకు వెళుతున్నాను. 2016లో ఆర్మిలో జాయిన్ అవ్వాలి అనుకున్నాను కానీ మెడికల్​లో అన్​ఫిట్​గా ఉండటం వల్ల నేను ఈ ఫీల్డ్​కు రావడం జరిగింది. పీజీ అయిన తర్వాత స్కూల్​లో ఎన్​సీసీ అధికారి కావాల్సి ఉంది అంటే ఇక్కడ వచ్చాను. నా శిక్షణలో ఉన్న ఇద్దరు పిల్లలు రిపబ్లిక్​ పరేడ్​లో పాల్గొన్నారు. అది నాకు గర్వకారణం." - భాను ప్రకాశ్, ఎన్‌సీపీ అధికారి

ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్​సీపీ కేర్‌ టేకర్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు ఈ యువకుడు. ఆర్మీలో చేరాలనుకున్న తన కల విద్యార్థుల ద్వారా సాకారం చేసుకోవాలని భావిస్తున్నాడు. విద్యార్థులును త్రివిధ దళాల్లో చేర్చడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నానని భాను ప్రకాశ్‌ చెబుతున్నాడు.ప్రభుత్వ ఉద్యోగమే అంతిమ లక్ష్యం కాదంటున్నాడు ప్రకాశ్‌. యువకులు తమ ప్రతిభకు పదును పెట్టాలని సూచిస్తున్నాడు. యువత తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని, సైన్యంలో చేరాలని కోరుతున్నాడు.

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.