ETV Bharat / state

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కార్​ సిద్ధం - అయినా ప్రైవేట్​ వైపే రైతుల మొగ్గు - prefer to sell paddy in Private

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 12:02 PM IST

Farmers prefer to sell paddy in private
Farmers Showing Interest to Sell Grain in Private

Farmers Showing Interest to Sell Grain in Private : యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా ఈసారి ప్రైవేట్‌లో అమ్మేందుకు రైతులు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చే కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్‌లోనే అధికంగా పలుకుతుండటంతో అటు వైపు అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో చెల్లింపుల్లో జాప్యం, నిబంధనల పేరిట కొర్రీలు, తాలుపేరిట తూకంలో కోతలు వంటి గతానుభవాలు రైతులు ప్రైవేట్‌ వైపునకు మళ్లేలా చేస్తున్నాయి.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సర్కార్​ సిద్ధం - అయినా ప్రైవేట్​ వైపే రైతుల మొగ్గు

Farmers Showing Interest to Sell Grain in private : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం 800లకిపైగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, తొలి రోజు 122 తెరిచారు. ధాన్యం రాక అధారంగా మిలిగినవి తెరవనున్నారు. కొనుగోళ్లకి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నా అమ్మేందుకు రైతులు మొగ్గుచూపట్లేదు. కనీస మద్దతు ధరకంటే అధికంగా ప్రైవేట్‌లో పలుకుతుండటంతో ఎక్కువగా వ్యాపారులు, మార్కెట్‌ యార్డుల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవాలంటే, నిర్ణీత తేమశాతం ఉండేలా ధాన్యాన్ని ఆరబెట్టాలి.

Farmers prefer to sell paddy in private : తాలు, మట్టి లేకుండా శుభ్రం చేయాలి. కానీ పొలం నుంచి నేరుగా కోసుకొని తీసుకొచ్చిన వడ్లకు ప్రైవేట్‌ వ్యాపారులు రూ.2 వేల రెండు వందల వరకు చెల్లిస్తున్నారు. తేమశాతం తక్కువగా ఉండి పంటనాణ్యంగా ఉంటే క్వింటా రూ. 2 వేల 500 వరకూ చెల్లిస్తున్నారు. దొడ్డురకాలు, నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యాన్ని ప్రైవేట్‌లో అధిక ధరకు కొనుగోలు చేయట్లేదు. అందుకే ఈసారి దొడ్డురకం, నాణ్యత లేని ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో పీఏసీఎస్​(PACS) తరపున, గూరకొండలో ఐకేపీ(IKP) ఆధ్వర్యంలో కేంద్రం తెరిచినా, రైతులెవరూ ధాన్యం అమ్మేందుకు రాలేదు. కోతలు ప్రారంభం కాలేదని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రైవేట్‌ వైపే మొగ్గుచూపుతున్న రైతులు : వర్షాభావం, భూగర్భజలమట్టాలు పడిపోవడం, జలాశయాలకింద పంటవిరామ ప్రకటనతో యాసంగిలో వరిసాగు పడిపోయింది. వేసినా కొన్నిచోట్ల ఎండిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. ప్రైవేట్‌లో అమ్ముకుంటే వెంటనే డబ్బులు చేతికొస్తాయి. చెల్లింపుల్లో జాప్యం ఉండదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోపెట్టే నిబంధనలతో ప్రైవేట్‌ వైపే మొగ్గుచూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా కర్ణాటకకు సరిహద్దు కావడంతో రాయచూరు వ్యాపారులు నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తారు. కొన్నిచోట్ల రైస్ మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారు. ఉగాది తర్వాత అమ్మకాలు ఊపందుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

'ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విధించిన ధర కన్నా ప్రైవేట్​ మార్కెట్​లో ఎక్కువగా ఉంది. గత సంవత్సరం గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ఏర్పాటు చేసినా ఎవరూ అమ్మకానికి రాలేదు. గత సంవత్సరంలో కూడా ప్రైవేట్​ వ్యక్తులు ఎక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు.'-రత్నమాల, గూరకొండ కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు షురూ - ప్రైవేట్​ కాంటాలు తెరిస్తే చర్యలు తప్పవని సీఎస్​ హెచ్చరిక - Paddy Procurement in Telangana

ధాన్యం కొనుగోళ్లు దాటాలీ సవాళ్లు- ఇకనైనా అన్నదాతకు గిట్టుబాటు ధర లభించేనా? - Paddy Procurement In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.